వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాను వణికిస్తున్న మరో మహమ్మారి: వరంగల్ జిల్లాలో ఆంత్రాస్ కలకలం; ఆందోళనలో జనం

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతుంది . దుగ్గొండి మండలం చాపల బండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోవడంతో గొర్రెల మరణాలపై స్థానికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంత్రాక్స్ వల్ల గొర్రెలు చనిపోయాయని పెద్ద ఎత్తున స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలోఉన్నారు. గొర్రెల ద్వారా మనుషులకు ఆంత్రాక్స్ సోకుతుందని ఆందోళనలో ఉన్నారు.

Recommended Video

Anthrax కలకలం... కరోనా లా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం | Telangana || Oneindia Telugu

వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్

 వరంగల్ జిల్లాలో వరుసగా గొర్రెల మరణాలు

వరంగల్ జిల్లాలో వరుసగా గొర్రెల మరణాలు

అసలేం జరిగిందంటే దుగ్గొండి మండలం చాపల బండ గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్ని రోజులుగా వరుసగా గొర్రెలు చనిపోతున్నాయి. మొదట సాధారణ మరణాలని భావించినా వరుసగా రోజూ గొర్రెలు చనిపోవటంతో అనుమానం వచ్చిన గొర్రెల్ యజమాని ఇక ఈ విషయాన్ని పశు వైద్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యులు చనిపోయిన గొర్రెలు శాంపిళ్లను సేకరించి జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆసుపత్రికి సంబంధించిన ల్యాబ్ కు పంపించారు.

గొర్రెలు ఆంత్రాక్స్ వల్ల చనిపోయినట్టు రిపోర్ట్

గొర్రెలు ఆంత్రాక్స్ వల్ల చనిపోయినట్టు రిపోర్ట్


పరీక్షలలో రిపోర్ట్ గొర్రెలు ఆంత్రాక్స్ వల్ల చనిపోయినట్లుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో వాళ్లంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేవలం ధూళి ద్వారా ఆంత్రాక్స్ న్యుమోనియా జనాలకు సోకుతుందని తెలుస్తుంది. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల, మాంసం ద్వారా కూడా ఆంత్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గతంలోనూ వరంగల్ జిల్లాలో ఒకమారు ఆంత్రాక్స్ బయటపడింది. ఇప్పుడు మళ్లీ తాజాగా ఆంత్రాక్స్ కారణంగా గొర్రెలు మృతి చెందుతున్నాయి అన్న వార్త జనాలను హడలెత్తిస్తున్నది.

 ఆంత్రాక్స్ సోకిన గొర్రెను తాకితే ఆంత్రాస్ వచ్చే ఛాన్స్

ఆంత్రాక్స్ సోకిన గొర్రెను తాకితే ఆంత్రాస్ వచ్చే ఛాన్స్

ఆంత్రాక్స్ వల్ల గొర్రెలు మృతి చెందిన నేపధ్యంలో రంగంలోకి దిగిన పశు వైద్య అధికారులు గొర్రెల మందను గ్రామానికి దూరంగా ఉంచాలని, ఆయా గొర్రెలమంద యజమానులకు సూచించారు. గ్రామంలోని 1200 గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాపించకుండా టీకాలు వేస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాధి 95 శాతం శరీరం తాకితే వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా, ఫ్లూ జ్వరాల లాగా ఆంత్రాక్స్ కూడా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం ఉందని, త్వరితగతిన ఇది వ్యాపిస్తుందని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు వైద్యులు.

ఆంత్రాస్ వ్యాధి లక్షణాలు ఇవే .. మూడు రోజుల్లోనే ఆంత్రాస్ లక్షణాలు బయటకు

ఆంత్రాస్ వ్యాధి లక్షణాలు ఇవే .. మూడు రోజుల్లోనే ఆంత్రాస్ లక్షణాలు బయటకు

వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆంత్రాస్ వ్యాధి బయట పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి బారినుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారికి ఇప్పుడు ఆంత్రాస్ మహమ్మారి భయాందోళనలు కలిగిస్తోంది. బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఆంత్రాస్ వ్యాధి సంక్రమిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయట పడతాయి కానీ కొన్ని కేసుల్లో రెండు నెలల వరకు లక్షణాలు బయటకు కనిపించవు. యాంటీ బయాటిక్స్ తో ఈ వ్యాధి లక్షణాలను నయం చేయొచ్చు కానీ వ్యాధి బాగా ముదిరిన తర్వాత నయం చేయడం సాధ్యం కాదు.

పశువుల నుండి పశువులకే కాదు మనుషులకు ఆంత్రాస్ వచ్చే అవకాశం

పశువుల నుండి పశువులకే కాదు మనుషులకు ఆంత్రాస్ వచ్చే అవకాశం

ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా వైద్యం ప్రారంభిస్తే అంత మంచిది అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి చర్మం పై బొబ్బలు దద్దుర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది పశువుల నుండి పశువుల కాకుండా పశువుల నుండి మనుషులకు సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

English summary
Anthrax is rampant in Warangal district. People in the village of Chapala Banda in Duggondi zone are fearful of reports that anthrax is the cause of death of four sheep in a span of four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X