వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ నీటి దొంగ..జగన్ గజ దొంగ : ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరరు: మంత్రి సంచలనం..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

మరోసారి ఏపీ - తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతోంది. ఫలితంగా మాటల తూటాలు పేలుతున్నాయి.ఏపీ ప్రభుత్వం చట్టాలను..ఒప్పందాలను ఉల్లంఘించి ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వంలోని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ సీఎం జగన్ వైఖరి పైనా తెలంగాణ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు.

 తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు..

తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు..


ఏపీ ఒప్పందాలకు విరుద్దంగా ఒక్క బొట్టు నీటిని కూడా వాడుకోలేదంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రశ్నించారు. సీఎం జగన్ మంచి మనసుతో స్నేహ హస్తం అందించారంటూ చెప్పుకొచ్చారు. మంచితనం చేతకాని తనం అనుకుంటే పొరపాటని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేక పోయిందని...అయినా..తాము మంచి మనసుతో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లామని చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణ మంత్రులు వరుసగా ఏపీ సీఎం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస గౌడ్ ఏపీ ప్రభుత్వ తీరును తప్పు బట్టారు.

యుద్దానికి సిద్దం కావాలంటూ..

యుద్దానికి సిద్దం కావాలంటూ..

ఇక, ఇప్పుడు మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాయలసీమ ఎత్తిపోతలను ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తే..తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో యుద్దానికి సిద్దం కావలంటూ మంత్రి పిలుపునివ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మహబూబ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించారంటూ ధ్వజమెత్తారు. జగన్ తండ్రి వైఎస్సార్ నాడు అక్రమంగా పోతిరెడ్డి పాడు నుండి 40 వేల క్యూసెక్కుల నీటిని దోచుకుపోయారంటూ వ్యాఖ్యానించారు.

జగన్ గజ దొంగ అంటూ..

జగన్ గజ దొంగ అంటూ..


ఎవ‌రైనా ఆంధ్ర‌వారు ఆంధ్రవారే అంటూ కామెంట్ చేసారు. వైఎస్ నీటి దొంగ అయితే...జగన్ గజ దొంగ అంటూ తీవ్రంగా స్పందించారు. దొంగతనంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాటుగా ఆర్డీఎస్ కాలువ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. ఏపీ హక్కు మేరకు నీటిని తీసుకోవాలని..తెలంగాణ హక్కు నీటిని తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరుకోరని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యే అవకాశం ఉంది.

English summary
Telangana minister Prasanth Reddy serious comments on AP Cm jagan. He says CM Jagan is looting water. Now water war became dialogue war between both states leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X