హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రాంనగర్' ఫ్యామిలికీ చంద్రబాబు 10లక్షలు, కెసిఆర్ బోళా శంకరుడు: కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర పేదరికంతో మంచాన పడిన భర్తకు వైద్యం చేయించలేక ఆయన కళ్లెందుటే ఆత్మహత్య చేసుకున్న శ్రీలక్ష్మి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందించింది. శ్రీలక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి భర్త వినోద్, ఆమె ఇద్దరు పిల్లలు వసతి పొందుతున్న ఏఎస్ రావు నగర్ దేశ్‌పాండే వృద్ధాశ్రమానికి బుధవారం ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి జి రామసుబ్బయ్య తరలి వెళ్లారు. సిఎంఆర్ఎఫ్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును వినోద్‌కు అందజేశారు.

దీనితో పాటు వినోద్ కుటుంబం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కూడా వారు అందించారు. వినోద్ త్వరగా కోలుకోవాలని, ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యలతో వృద్ధిలోకి రావాలని సీఎం చంద్రబాబు ఆ లేఖలో ఆకాంక్షించారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, అనారోగ్యంతో మంచం దిగలేని భర్త, కుటుంబ భారం మోయలేక కొద్ది నెలల క్రితం శ్రీలక్ష్మి అనే మహిళ రాంనగర్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పైన స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

రైతు ఆత్మహత్యలపై అధ్యయనం: కవిత

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్నదని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన పలువురు ప్రముఖులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.

బాధితులకు చంద్రబాబు లేఖ

బాధితులకు చంద్రబాబు లేఖ

'మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూపాయలు పది లక్షల చెక్కు రూపములో మంజూరు చేయడమైనది. ఈ చెక్కును మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేసుకోగలరు. ఈ ఆర్థిక సహాయంతో మీకు వెసులుబాటు ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుందని ఆశిస్తున్నాను' అని చంద్రబాబు రాసిన లేఖలో ఉంది.

కవిత

కవిత

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడుగా వారి కుటుంబాల్లో మానసిక స్థెర్యం నింపేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించిందన్నారు. రైతుల సంక్షేమంతోపాటు ఆత్మహత్యలను నిరోదించేందుకు దీర్ఘకాల వ్యూహంతో కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

కవిత

కవిత

రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం కోసం 1.20 లక్షల మంది తెలంగాణ జాగృతి వలంటీర్లను రంగంలోకి దింపుతామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సక్రమంగా ఆత్మహత్య బాధిత రైతుల కుటుంబాలకు చేరేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కోదండరామ్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తనను కలిసిన సింగరేణి కార్మికులతో కవిత మాట్లాడుతూ... సీఎంను కలిసి మీ సమస్యలను వివరించడమే కాకుండా 20 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కెసిఆర్ బోళా శంకరుడు అని, ఆయన అనుకుంటే కానిది ఏదీ లేదని కవిత వ్యాఖ్యానించారు.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడుగా వారి కుటుంబాల్లో మానసిక స్థెర్యం నింపేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించిందన్నారు. రైతుల సంక్షేమంతోపాటు ఆత్మహత్యలను నిరోదించేందుకు దీర్ఘకాల వ్యూహంతో కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

ఇందుకోసం 1.20 లక్షల మంది తెలంగాణ జాగృతి వలంటీర్లను రంగంలోకి దింపుతామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సక్రమంగా ఆత్మహత్య బాధిత రైతుల కుటుంబాలకు చేరేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కోదండరామ్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ బోళా శంకరుడన్న కవిత

మన ముఖ్యమంత్రి కెసిఆర్ బోళాశంకరుడు అని కల్వకుంట్ల కవిత మరో సందర్భంలో అన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 354 రోజుల నుంచి దీక్ష చేస్తున్న సింగరేణి వీఆర్ఎస్ కార్మికులు బుధవారం తెలంగాణ భవన్లో కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

కెసిఆర్ జనం సమస్యలు తెలిసిన వ్యక్తి అని, ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం ఆయన ఆలోచిస్తారన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని అంశాలపై దృష్టి పెడుతున్న సీఎం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. 345 రోజుల నుంచి దీక్షను కొనసాగిస్తున్న సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికులు తమ దీక్షను విరమించాలన్నారు.

English summary
AP CM Nara Chandrababu Naidu relief fund to Ram Nagar patient on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X