వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ విద్యుత్ సంస్థలే బాకీ .. రూ.2400 కోట్లు ఇవ్వాలన్న ట్రాన్స్ కో సీఎండీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థలపై టీఎస్ ట్రాన్స్ కో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే .. నిజం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ట్రాన్స్ కో బాకీ లేదని .. ఏపీ నుంచే తమకు రూ.2400 కోట్లు రావాలని స్పష్టంచేసింది.

మీరే డబ్బులివ్వాలి ..

మీరే డబ్బులివ్వాలి ..

ఏపీకి తెలంగాణ విద్యుత్ సంస్థలు రూ.5 వేలు బకాయి పడ్డారని చేస్తున్న ప్రచారాన్ని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తిప్పికొట్టారు. వారు దురుద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి, అధికారులకు మధ్య సమాచారం లోపం ఉందని, అందుకే పొంతనలేని లెక్కలు చెప్తుతున్నారని విమర్శించారు. ఏపీకి తెలంగాణ బకాయి పడలేదని, మీరే తమకు డబ్బులివ్వాలని పేర్కొన్నారు.

రూ.2406 కోట్లు బాకీ

రూ.2406 కోట్లు బాకీ

వాస్తవానికి ఏపీ విద్యుత్ సంస్థలు తెలంగాణ ట్రాన్స్ కో కు బకాయి పడిందని గుర్తుచేశారు. రూ.2406 కోట్లు ఏపీ నుంచి రావాలని చెప్పారు. ఈ వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు విస్మరించారని మండిపడ్డారు. తిరిగి వారే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ డిస్కామ్స్ నుంచి రూ.1659 కోట్లు ఏపీ ట్రాన్స్ కో నుంచి 101 కోట్లు, ఏపీ జెన్ కో నుంచి 3096 కోట్లు, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ పెట్టుబడుల కింద ఏపీ నుంచి రూ.929 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తం రూ. 5785 కోట్లు అని చెప్పారు. ఏపీ జెన్ కోకు తెలంగాణ డిస్కంలు రూ.3379 కోట్లు ఇచ్చినా .. రూ.2406 కోట్లు తెలంగాణకే రావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. వాస్తవాలను మరచి ఏపీ విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

వైమానిక దాడులతో చెట్లకు నష్టం వాటిల్లిందట .. అభినందన్ పై కేసు నమోదుచేసిన పాకిస్థాన్

పరిష్కారానికి మేం రెడీ

పరిష్కారానికి మేం రెడీ

తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థల్లో నెలకొన్న వివాదంపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు ప్రభాకర్ రావు. వివిధ అంశాలపై చర్చించేందుకు రెడీగా ఉన్నామని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. బకాయిలతోపాటు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన అంశాలను పరిష్కరించుకుందామని ఏపీ విద్యుత్ సంస్థలకు 8 లేఖలు రాసిన స్పందించలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా చర్చలకు సిద్ధమని .. డిస్కషన్ తర్వాత బాకీ తేలితే 24 గంటల్లో నగదు జమచేస్తామని పేర్కొన్నారు.

జవనరి వరకు బకాయి చెల్లింపు

జవనరి వరకు బకాయి చెల్లింపు

సోలార్ విద్యుత్ సంస్థలకు బకాయి చెల్లించడం లేదనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తప్పపట్టారు. 8 నెలల నుంచి బకాయి చెల్లించడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. జనవరి వరకు ఉన్న బకాయిలను చెల్లించామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు.

English summary
trans co cmd prabhakar rao said Rs 2406 crore would come from AP. The fact that the AP government ignored. They are go to the National Company La Tribunal. An amount of Rs 1659 crore from APDSCOMs would be Rs 101 crore, from AP Trans CO Crore, Rs 3096 crore from AP JEN Co and Rs 929 crore from AP under Krishnapatnam Power Plant Investment. This amount is Rs. 5785 crores he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X