వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భన్వర్‌లాల్‌‌కు షాక్! రిటైర్ అయిన కొద్దిసేపటికే క్రమశిక్షణ చర్య, ఏపీ ప్రభుత్వం ఆదేశం

పదవీ విరమణ చేసిన ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌ లాల్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌ లాల్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎన్నికల సంఘం ప్రధాని అధికారిగా మంగళవారమే భన్వర్‌లాల్ పదవీ విరమణ చేశారు. కొత్త ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇన్‌చార్జి అనూప్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.

banwar-lal

భన్వర్‌లాల్ అలా పదవీ విరమణ చేశారో లేదో ఇలా ఏపీ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించక పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకెళితే.. ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగంపై గతంలో భన్వర్‌లాల్‌కు రూ. 17 లక్షల మేర ప్రభుత్వం జరిమానా విధించింది.

అయితే ఈ జరిమానాను గత ప్రభుత్వం రూ. 4,37,500 లకు కుదించింది. అయితే భన్వర్‌లాల్ ఆ బకాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రూ.17 లక్షల జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకోనుంది.

English summary
The Andhra Pradesh Chief Secretary has fined 17 lakh Rupees to outgoing EC Bhanwarlal. Today is the last day in office for Bhanwarlal as he is retiring today and a fine is imposed on this IAS officer, basing on a previous issue. Bhanwarlal was said to have fined 17 lakhs for misusing official bungalow and Bhanwarlal got this fine reduced to about 4.35 lakhs by the previous government, which is also not paid by him. Hence, the AP Government has imposed 17 lakhs fine again on Bhanwarlal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X