వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు విభజన: సుప్రీం సీజేను కలిసిన హైకోర్టు సీజే, గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోస్లే శనివారం కలిశారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న ఆయన చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను ఆయన నివాసంలో ఈరోజు ఉదయం కలిశారు. హైకోర్టు విభజనపై తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సుమారు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు.

అనంతరం ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జెఎస్ శేఖర్, అనిర్ ఆర్ దవే‌లతో సమావేశమై హైకోర్టు విభజనపై తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియపై కసరత్తు ముమ్మరమైనట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడను కలిసి హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. అనంతరం మంత్రి సదానందగౌడ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను కలిసి హైకోర్టు విభనజపై చర్చించిన విషయం తెలిసిందే.

talangana judge band

ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు చేస్తోన్న ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో తాజాగా సుప్రీం సీజేను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలడవం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ న్యాయాధికారుల బృందం ఆదివారం సుప్రీంకోర్టు సీజేను కలవనుంది.

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్

హైకోర్టు విభజనపై తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతన్న ఆందోళనల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన అంశంతో పాటు జడ్జిల ఆప్షన్ల ప్రక్రియను వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహాన్‌ను బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలవనున్నారు.

గన్‌పార్క్ వద్ద తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు నిరసన ప్రదర్శన
గన్‌పార్క్ వద్ద శనివారం తెలంగాణ జడ్జీలు, న్యాయవాదులు మౌనదీక్ష చేపట్టారు. వీరి ఆందోళనకు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్రం హైకోర్టు విభజన విషయంలో తాత్సారం చేస్తుండటంతో విధిలేక తాము ఆందోళనలు చేయాల్సి వస్తుందని తెలిపారు.

kcr meets governer

సస్పెండ్ చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆప్షన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగే వరకు తమ ఆందోళనను ఆపబోమని తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ అడ్వకేట్ జనరల్
11మంది న్యాయాధికారులు, 9మంది న్యాయ సిబ్బందిని హైకోర్టు సస్పెన్షన్ చేయడం, ఇందిరాపార్కు వద్ద శుక్రవారం న్యాయవాదుల నిర్వహించిన 'చలో హైదరాబాద్' ధర్నా నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా సమావేశమై న్యాయవాదుల ఆందోళన, ఇందుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తొలుత గవర్నర్‌తో అడ్వకేట్ జనరల్ సమావేశమైనట్టు సమాచారం.

కేంద్రం జోక్యం చేసుకుని న్యాయాధికారుల కేటాయింపు నిబంధనల ప్రకారం చేసినట్టయితే బాగుండేదని ఏజీ సూచించినట్టు తెలిసింది. హైకోర్టు విభజనకు కేంద్రం, సుప్రీం కోర్టు, హైకోర్టు వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప న్యాయవాదులు ఆందోళనను విరమించే అవకాశాలు లేవని గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.

English summary
Ap High court cji bhosle meets supreme cji TS Thakur in News delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X