వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. సీఎం కేసీఆర్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు...

|
Google Oneindia TeluguNews

ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన స్పందించారు.

Recommended Video

SR NTR's Lesson In School Education 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ పాఠ్యాంశం! || Oneindia

'కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.' అని పేర్కొన్నారు.

ap mla balakrishna thanks to tollywood hero nandamuri balakrishna

కాగా, పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని... పేదలకు రూ.2కే కిలో బియ్యం,మధ్యాహ్నం భోజన పథకం,మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్‌ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.

English summary
Andhra Pradesh Hindupuram MLA Balakrishna said thanks to Telangana CM KCR for NTR's lesson in school education text books.Balakrishna felt happy for CM KCR's decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X