• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీ

|

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదలుకాగా, రెండు రాష్ట్రాల మంత్రులు, అన్ని పార్టీల నేతలు వరుసగా కామెంట్లు చేస్తూ వాతావరణాన్ని వేడెక్కించారు. ఇది చాలదన్నట్లు రైతులు సైతం నేరుగా జల జగడంలోకి దూసుకొచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ రెండు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ తో కూడిన అంశం మళ్లీ తెరపైకిరావడం రాజకీయంగానూ ప్రధాన్యత సంతరించుకుంది..

యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలుయూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కోర్టుకు ఏపీ రైతులు

తెలంగాణ కోర్టుకు ఏపీ రైతులు

కృష్ణా జలాల్లో ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని 50:50శాతంగా మార్చాలని వాదిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వర్షాలు సరిగా కురవని పక్షంలో ఏపీలో కరువు పరిస్థితులకు దారితీసే అవకాశాలను పెంచుతూ, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

ఈ చర్యను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ నేతలూ ఖండించడంతో అన్ని ప్రాజెక్టుల వద్ద భారీ ఎత్తున పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు, నేతలు నేరుగా తలపడుతోన్న జల వివాదంలోకి ఇప్పుడు రైతులు ఎంటరయ్యారు. ఏపీకి చెందిన రైతులు ఆదివారం తెలంగాణ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎవరా రైతులు? పిటిషన్‌లో ఏముంది?

ఎవరా రైతులు? పిటిషన్‌లో ఏముంది?

కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వల్ల ఏపీ రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య అనే ఇద్దరు రైతులు తెలంగాణ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్లు.. శ్రీశైలం ఎగమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం జూన్ 28న కేసీఆర్ సర్కారు జారీ చేసిన జీవోను రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరారు. హౌజ్ మోషన్ పిటిషన్ కావడంతో దీనిపై హైకోర్టు త్వరితగతిన స్పందించనుంది. ఒక వేళ ఇది విచారణకు అర్హమైతే గనుక జల జగడం వేడి మరికొంత కాలం కొనసాగనుంది. ఇదిలా ఉంటే,

దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలుదేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలు

జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీ

జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీ

సరిగ్గా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేళ, వర్షా కాలం ప్రారంభంలో కృష్ణా జలాల వివాదం తెరపైకి రావడాన్ని జగన్-కేసీఆర్ ల ఉమ్మడి కుట్రగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రకటనలో మోదీ సర్కారును టార్గెట్ చేయడం, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, కృష్ణా బోర్డు వైఫల్యాలను ఎత్తి చూపడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. కృష్ణా నదీజలాల వినియోగంపై వివాదాల పరిష్కారంలో బోర్డు విఫలైమందని, కేంద్రం తీరు వల్లే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు తీవ్రమవుతున్నాయని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వ్యాఖ్యానించాయి.

కేసీఆర్ మరో అడుగు ముందుకేసి 66:34 నిష్పత్తిని 50:50శాతంగా మార్చాలనీ పట్టుపడుతున్నారు. జలాల విషయంలో జగన్-కేసీఆర్ డ్రామాలాడుతున్నారన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం సీఎంల ట్రాప్ లో పడిపోయారా? అన్నట్లుగా కేంద్రానికి రాసిన తాజా లేఖలో కృష్ణా రివర్‌బోర్డు పరిధిని ఖరారు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.

English summary
In an interesting turn, farmers now directly entered into andhra pradesh, telangana water dispute. two farmers of krishna district has filed a house motion petition in telangana high court on sunday against cm kcr and ts govt go for power production at srisailam project. farmers named Central Water Resources Department, KRMB, Telangana Genco, Telangana, AP Governments and AP Irrigation Department as respondents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X