వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వైసీపీ ప్రభంజనం .. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా.. మీడియాతో కేటీఆర్ చిట్ చాట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోందన్నారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీడీపీకి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ వల్ల చంద్రబాబు ఒరిగిదేమీ లేదని .. నష్టమే జరుగుతుతుంని స్పష్టంచేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్.

ఫ్యాన్ గాలి వీస్తోంది

ఫ్యాన్ గాలి వీస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గాలి వీస్తోందన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ వల్ల అక్కడి ప్రజలు జగన్ వ్యతిరేకిస్తానడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు పక్క రాష్ట్రంగా సాయమే చేశామని గుర్తుచేశారు. హూదుద్ తుపాన్ బాధితులను అండగా నిలిచామన్నారు. కొత్త రాజధాని కట్టుకుంటానంటే సాయం చేద్దామనుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు ప్రాంతీయ పార్టీగా మద్దతిస్తుందని స్పష్టంచేశారు. దీంతో తమపై ఏపీ ప్రజల్లో వ్యతిరేక భావం ఉండదని .. అది కేవలం టీడీపీ నేతలు సృష్టిస్తున్న గోబెల్స్ ప్రచారమేనని తప్పుపట్టారు.

ఢిల్లీలో చక్రం తిప్పుతాం

ఢిల్లీలో చక్రం తిప్పుతాం

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం వచ్చే అవకాశం లేదన్నారు. అధికార బీజేపీ 150 సీట్లు, విపక్ష కాంగ్రెస్ 100 సీట్లకు చేరుకోదని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీని శాసిస్తామని స్పష్టంచేశారు.

ఎన్నికల తర్వాతే ఫ్రంట్

ఎన్నికల తర్వాతే ఫ్రంట్

సార్వత్రిక ఎన్నికలు ముగిసినా తర్వాతే ఫెడరల్ ఫ్రంట్ రూపుదిద్దుకుంటోందన్నారు. ఫ్రంట్ భాగస్వామ్య పక్షాలు హస్తినలో కీ రోల్ పోషిస్తారని చెప్పారు. ఫ్రంట్ లో టీఆర్ఎస్ పార్టీది పెద్ద అన్న పాత్ర అని స్పష్టంచేశారు

విభేదాలు ఓకే .. సంస్థలను అడ్డుకోవడం సరికాదు

విభేదాలు ఓకే .. సంస్థలను అడ్డుకోవడం సరికాదు

మమతా బెనర్జీ, మోదీ మధ్య నెలకొన్న విభేదాలపై కేటీఆర్ స్పందించారు. ఓ రాష్ట్రంగా కేంద్రంతో విభేదాలు ఉండటం సహజమే గానీ .. కేంద్ర సంస్థలను అడ్డుకోవడం మాత్రం సరికాదన్నారు. అందుకే బెంగాల్ ఇష్యూ అప్పుడు స్పందించలేదని చెప్పారు.

పుల్వామా చెబితే ఇక అంతే

పుల్వామా చెబితే ఇక అంతే

పుల్వామా సంఘటనను సాకుగా చూపి వాడుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు కేటీఆర్. రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని భావిస్తే ఆ పార్టీకే నష్టమని చెప్పారు. జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడికి భద్రతా వైఫల్యం అధికార బీజేపీ పార్టీది కాదా అని ప్రశ్నించారు.

English summary
In ap assembley elections ycp win says ktr. tdp loss the power. saturday assembley session he chit chat media. in central regional partys are key role. nda 150 sates, congress 100 seats only he estimates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X