• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

By Nageswara Rao
|

హైదరాబాద్: సాప్ట్‌వేర్ ఇంజనీర్‌కు అరుదైన గుండెమార్పిడి చికిత్సను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడతున్న 35 ఏళ్ల నవీన్‌కుమార్ అనే వ్యక్తికి ప్రముఖ సీనియర్ హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ శస్త్ర చికిత్సను ఫిబ్రవరి 26న విజయవంతంగా నిర్వహించింది.

శుక్రవారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోగిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె మార్పిడి నిపుణులు డా. గోపాలకృష్ణ గోఖలే వివరాలను వెల్లడించారు. యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న నవీన్‌కుమార్ నాలుగేళ్లుగా డైలేటెడ్ కార్డియోమయోపతితో బాధపడుతున్నాడు.

ఈ వ్యాధి వల్ల ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాధితుడికి గడిచిన ఆరునెలల్లో మూడు సార్లు వైద్యులు చికిత్స అందించారు. జనవరి 18న అపోలో హాస్పిటల్‌కు వచ్చినప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చేర్పించి చికిత్స ప్రారంభించారు.

 టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ గోఖలే, డాక్టర్ మనోజ్ అగర్వాల్ రోగిని పరీక్షించి గుండె మార్పిడి అనివార్యమని తేల్చారు. అతని పేరును జీవన్‌దాన్‌లో నమోదు చేయించారు. ఫిబ్రవరి 25న బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయువాలను దానం చేసేందుకు ఆ కుటుంబీకులు ముందుకు వచ్చారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

అయితే మృతుడి బ్లడ్‌ప్రెషర్ చాలా తక్కువగా ఉండటం వల్ల అతని నుంచి సేకరించిన గుండెను మరో రోగికి అమర్చడం వీలుకాలేదు. రోగి బీపీ కూడా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆ తర్వాత గుండెను సేకరించడానికి ముందు ఎక్కువ మోతాదులో ఔషధాలు అందించి బీపీని నిలకడగా ఉండేలా ఏర్పాటు చేశారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

అనంతరం అత్యంత సాహసంతో ఆ గుండెను సేకరించి నవీన్‌కు అమర్చినట్లు గోఖలే తెలిపారు. ఎనిమిది గంటల సమయం పట్టినట్లు వివరించారు. శస్త్రచికిత్స పూర్తయిన 48గంటల్లోనే రోగిలో కదలికలు వచ్చాయన్నారు. ప్రస్తుతం నవీన్ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.

 టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు

మన దేశంలో ఇప్పటి వరకు కేవలం 250 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే జరిగినట్లు వివరించారు.ఈ సమావేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న నవీన్‌తో పాటు అతడి భార్య అన్నపూర్ణ, ఏడాదిన్నర కుమారుడు లక్షిత్‌తో పాటు అపోలో వైద్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం రోగి సాధారణ జీవితం గడుపుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 36-year-old IT professional, suffering from a terminal heart disease successfully underwent a heart transplant at a city hospital and got a new lease of life. V Naveen Kumar, a software engineer by profession had to quit his job at Accenture a year back due to the heart problem. He was diagnosed with dilated cardiomyopathy for the last four years and it worsened further eight months ago and was virtually confined to home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more