వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో సెల్ఫీలు దిగాలి.. ఎందుకో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఉద్యోగులంటే ఎప్పుడైన రావచ్చు ఎప్పుడైన పోవచ్చు. పేరుకే ఎనమిది గంటల ఉద్యోగం గాని చేసేది మాత్రం అయిదారు గంటలు కూడ ఉండదు. ఓక్కోసారి వారు కార్యాలయాలకు వస్తారో రారో కూడ తెలియని పరిస్థితి నెలకొంటుంది. తాపిగా మరురోజు వచ్చి అంటెండెన్స్ రిజిస్టర్‌లో సంతాకాలు పెట్టి జీతాలు తీసుకునే ఉద్యోగులు చాలమందే ఉంటారు. దీంతో పనుల కోసం వచ్చిన ప్రజలు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. అయితే పరిస్థితికి చెక్ పెట్టారు తెలంగాణలోని కొత్తగా ఎర్పడిన ములుగు జిల్లా కలెక్టర్.

జిల్లాలోని ఉద్యోగుల హజరు కోసం ములుగు వెలుగు అటెండెన్స్ అనే ఓ యాప్‌ను జిల్లా కలెక్టర్ స్వయంగా తయారు చేయించారు.ఇక యాప్‌ను ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులంతా ఉదయం తొమ్మిది గంటలకే తమ కార్యాలయాలకు చేరుకుని వారి వారి స్థానాల నుండి సెల్ఫీలు దిగి ఆప్‌లో అప్‌లోడ్ చేసి కలెక్టర్‌కు పంపాలి.

app for the govt employees attendance, Mulugalucollector himself has created

ఒక వేళ ఉద్యోగి ఎవరైనా ఫిల్డ్ వర్క్ కోసం చేసినా.. యాప్‌లో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.ఇక ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గరి నుంచి, కలెక్టర్ కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఈ యాప్‌లో సెల్ఫీ దిగి అటెండెన్స్‌ చెప్పాల్సిందేనట. అంతేకాదు.. ఏ సమయానికి ఆఫీసుకు వస్తున్నారు? ఏ సమయానికి వెళ్తున్నారు? తదితర వివరాలు కూడా యాప్‌లో పొందుపరచాల్సిందే. అయితే ఈ సెల్ఫి విధానంపై కొందరు ఉద్యోగులు వ్యతిరేకత కనబరుస్తున్నా... ప్రజలు మాత్రం కలెక్టర్ చేపట్టిన సంస్కరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Mulugalu district collector himself has created an app for the attendance of the employees, called ''Mulugalu velugu attendance''.All employees have to come to their offices at nine o'clock in the morning and upload their selfies from their locations and upload them in the app and send it to the collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X