హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శుభవార్త:హైద్రాబాద్ ఐఐఐటీలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్: ఆపిల్

ఐఐటీ-హైదరాబాద్‌ విద్యార్థులకు శుభవార్త. తొలిసారి కూపర్టినోకి చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇంక్‌ భారత్‌లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ జరిపేందుకు రానుంది. ఐఐఐటీ-హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్‌ విద్యార్థులకు శుభవార్త. తొలిసారి కూపర్టినోకి చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇంక్‌ భారత్‌లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ జరిపేందుకు రానుంది. ఐఐఐటీ-హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నట్టు ఆపిల్ ప్రకటించింది.

ఇప్పటికే బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంఎస్‌సీ(రీసెర్చ్‌)లో పలు విభాగాలకు చెందిన 350 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నారు. డిసెంబర్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ప్రారంభించనున్నారు.

Apple campus placement: Tech giant to hire Techies from IIIT-Hyderabad

ఆపిల్‌తో పాటు పలు గ్లోబల్‌ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లు కూడా ఈ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొననున్నాయి. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ఆపిల్‌ రావడం తెలిసి మేము చాలా సంతోషించాం. అయితే ఎలాంటి ప్రొఫైల్స్‌ను కంపెనీ ఆఫర్‌ చేయనుందో ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది అద్భుత అవకాశం'' అని ఐఐఐటీ-హైదరాబాద్‌ ప్లేస్‌మెంట్ల అధినేత టీవీ దేవీ ప్రసాద్‌ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్సు, ఆటోమేషన్‌లకు నియామకాలు జరుపుకోవడానికి ఈసారి కంపెనీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇటీవల భారత్‌కు విచ్చేసిన ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, భారత్‌లో పెట్టుబడులు పెంచనున్నట్టు తెలిపారు. అంతేకాక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్సు, ఆటోమేషన్‌లో నియామకాలను ఎక్కువగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.

English summary
Good news for engineering students as leading tech giant Apple has decided to come to International Institute of Information Technology (IIIT-H) for campus recruitment for the first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X