వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దరఖాస్తులు బుట్ట ధాఖలు.. ఎమ్మార్వో నిర్వాకాన్ని బయట పెట్టిన మహిళ..!!(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అదికారుల్లో పేరుకుపోయిన అలసత్వం.. తలకెక్కిన నిర్లక్ష్యాన్ని.. ఆ ఏమవుతుందిలే.. అడిగేది ఎవరు అనే చులకన భావం.వ్రుత్తి పట్ల భాద్యతా రాహిత్యం.. అన్ని కలిసి సామాన్య ప్రజానికాన్ని సమస్యలలోకి నెడుతున్నారు. బాద్యతగా ప్రజల సమస్యలను పట్టించుకుని పరిష్కారం చూపాల్సిన అదికారులే ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ప్రజలను అసహనానికి గురి చేస్తోంది. ప్రజల అవసరాల మేరకు వారు పెట్టుకున్న అర్జీలను ఒరిజినల్ సర్టిఫికేట్లతో సహా చెత్తబుట్టలో ప్రత్యక్ష్యం కావడం జనాలను ఆశ్యర్యానికి, ఆగ్రహానికి గురి చేస్తోంది. తాజాగా సరూర్ నగర్ మండలాఫీస్ లో బుట్టదాఖలైన ఈ సేవా అప్లికేషన్లతో పాటు, ఒరిజినల్ పత్రాలను ఓ మహిళ బయటపెట్టింది.

 Applications are in the dustbin.!responsibilities also..!MRO negligence betrayal.!

మండల కార్యాలయం బయట కాగితాలను పరిశీలించిన ఓ మహిళ అవి దేనికి సంబందించినవో, ఎక్కడనుండి వచ్చాయో, ఎవరు, దేనికోసం ధరఖాస్తు చేసుకున్నారో సునిశితంగా పరిశీలించారు. అంతే కాకుండా సరూర్ నగర్ ఎమ్మార్వో శ్రీనివాస రావు నిర్లక్ష్యాన్ని కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేసారు. ఏదైనా పనికోసం సామాన్య ప్రజానికం చేసుకున్న దరఖాస్తు ఫారాల పట్ల సదరు ఎమ్మార్వోకు ఉన్న శ్రద్దను కూడా ఆవిడ బట్టబయలు చేసారు. దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకు పని ఏమయ్యిందో కనుక్కునేందుకు సరూర్ నగర్ మండల కార్యాలయంకు చేరకున్న వారికి చేదు అనుభవాలు ఎదురైన సంఘటనలు అనేకం ఉన్నాయని ఆవిడ చెప్పుకొస్తున్నారు. ప్రజలు అప్లికేషన్ తో పాటు జత చేసిన ఒరిజినల్ సర్తిఫికెట్లను కూడా చెత్తలో వేయడం ఏంటని ఆవిడ నిలదీస్తున్నారు. ఇంతకి సరూర్ నగర్ మండల కార్యాలయంలో ఏం జరుగుతోంది, ఎమ్మారో బాద్యతా రాహిత్యం ఏమేరకు రంకెలేస్తుందో ఆవిడమాటల్లోనే విందాం..!!

English summary
Saroor Nagar MRO Srinivasa Rao tried to expose the neglect. She also exposed the MRo's attention to the formal formalities of the general public for any work. There are a number of incidents involving bitter experiences for those who have joined the Saroor Nagar Mandal office to find out what has been working for a few days of application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X