వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహనం లేదా.?మీరు ప్రజా ప్రతినిధులా.?విధ్వంసానికి ఎలా పాల్పడతారు.?బీజేపి కార్పోరేటర్లపై మేయర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బిజెపి కార్పొరేటర్లు వారి అనుచరులతో జిహెచ్ఎంసి ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్దతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ బీజేపీ కార్పొరేషన్ ఆస్తులు ధ్వంసం చేయడం సరియైన చర్య కాదు అని మేయర్ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బిజెపి కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

 కావాలనే రచ్చ చేస్తే ఎలా.. బీజేపి కార్పోరేటర్లపై మండిపడ్డ మేయర్

కావాలనే రచ్చ చేస్తే ఎలా.. బీజేపి కార్పోరేటర్లపై మండిపడ్డ మేయర్

రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని మేయర్ తెలిపారు. తనను కలిసేందుకు అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ బిజెపి కార్పొరేటర్లు ఎందుకు రాలేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జిహెచ్ఎంసి అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కరించటంలో రాజిపడటంలేని పోరాటం చేస్తున్నారని అన్నారు.

 లోతట్టు ప్రాతాంల పర్యటనకు వెళ్లాం.. సహనం కోల్పోతే ఎలా అని ప్రశ్నించిన విజయలక్ష్మి..

లోతట్టు ప్రాతాంల పర్యటనకు వెళ్లాం.. సహనం కోల్పోతే ఎలా అని ప్రశ్నించిన విజయలక్ష్మి..

తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్షేత్ర స్ధాయి పర్యటనలో ఉన్నానని, సిబ్బందికి లోతట్టు ప్రాతాంల ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలో సూచనలు ఇచ్చేందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతలోనే ఇలాంటి బీజేపి కార్పోరేటర్లు నిరసన చర్యలకు దిగడం బాగాలేదని మేయర్ తెలిపారు. ప్రజా స్వామ్యంలో ప్రజా ప్రతినిదులుగా ఎంపికైనప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించాలని బీజేపి కార్పోరేటర్లకు సూచించారు.

 అందరిని సమన్వయం చేసుకోవాలి.. కార్యాలయంలో కూర్చుంటే ఎలా అంటున్న విజయలక్ష్మి

అందరిని సమన్వయం చేసుకోవాలి.. కార్యాలయంలో కూర్చుంటే ఎలా అంటున్న విజయలక్ష్మి

అంతే కాకుండా ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ ముంపుకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్ధేశంతో రాత్రింబవళ్లు తేడాలేకుండా పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పర్యవేక్షించడం జరిగిందని, మేయర్ కార్యాలయం నిరంతరాయంగా పనిచేస్తుందని విజయ లక్ష్మి తెలిపారు.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
 బీజేపి కార్పోరేటర్లు చేసింది తప్పు.. ఆస్తులను ద్వసం చేయడం క్షమించరాని తప్పేనన్న మేయర్

బీజేపి కార్పోరేటర్లు చేసింది తప్పు.. ఆస్తులను ద్వసం చేయడం క్షమించరాని తప్పేనన్న మేయర్

ఇదిలా ఉండగా కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని గుర్తు చేసారు. ఆ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బిజెపి కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా ఈ రోజు ఈ గొడవ చేసారని, ఈ విషయం సహించరాదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.

English summary
City Mayor Gadwala Vijayalakshmi said the destruction of GHMC assets by BJP corporators along with their followers was a heinous act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X