వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోలేవి, పార్వతి మాటేమిటి: పోలీస్‌లకు కోర్టు షాక్, ప్రశ్నల వర్షం, గజల్ శ్రీనివాస్‌కు చుక్కెదురు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్‌కు సంబంధించి నాంపల్లి కోర్టులో శుక్రవారం వాదనలు నడిచాయి. ఇరువురి వాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. గజల్‌కు పలుకుబడి ఉందని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదనలతో ఏకీభవించి బెయిల్ ఇవ్వలేదు.

Recommended Video

గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

గజల్ శ్రీనివాస్ తరఫున ఉమామహేశ్వర రావు అనే లాయర్ వాదనలు వినిపించారు. గజల్‌కు బెయిల్ ఇవ్వాలని వాదించారు. మరోవైపు బెయిల్ వద్దని పోలీసులు వాదించారు.

వాదనల సమయంలో పోలీసుల తరఫు లాయర్‌పై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సీడీలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని, ఏ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉందని ఎలా చెబుతారని, కోర్టు అనుమతి లేకుండా సీడీలను ఎఫ్ఎస్ఎల్‌కు ఎలా పంపిస్తారని ప్రశ్నించింది.

గజల్ శ్రీనివాస్‌ను ఇంకా ఏం విచారిస్తారు: పోలీసులతో జడ్జి, వీడియోలతో అడ్డంగా బుక్కైనట్లే! గజల్ శ్రీనివాస్‌ను ఇంకా ఏం విచారిస్తారు: పోలీసులతో జడ్జి, వీడియోలతో అడ్డంగా బుక్కైనట్లే!

స్టింగ్ ఆపరేషన్, కుట్రపూరిత ఫిర్యాదు

స్టింగ్ ఆపరేషన్, కుట్రపూరిత ఫిర్యాదు

బాధితురాలుగా చెప్పుకుంటున్న యువతి స్టింగ్ ఆపరేషన్ చేసి, ఆ తర్వాత కుట్రపూరితంగా ఫిర్యాదు చేస్తే కేసు ఎలా నమోదు చేస్తారని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదంతా ఓ కుట్రపూరితంగానే జరిగిందని చెప్పారు.

కేసులో ఆధారాలు సేకరించాల్సింది లేదు

కేసులో ఆధారాలు సేకరించాల్సింది లేదు

కేసులో ఇప్పటికే వీడియోలు సహా అన్ని ఆధారాలు పోలీసులు సేకరించారని, మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం లేదని గజల్ శ్రీనివాస్ తరఫు లాయర్ చెప్పారు. కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

గజల్ శ్రీనివాస్ కేసు: కోర్టులో పోలీసులకు షాక్, 20 వీడియోలతో బిగుస్తున్న ఉచ్చు!గజల్ శ్రీనివాస్ కేసు: కోర్టులో పోలీసులకు షాక్, 20 వీడియోలతో బిగుస్తున్న ఉచ్చు!

కౌంటర్ వాదనలపై పోలీసులకు కోర్టు ఝలక్

కౌంటర్ వాదనలపై పోలీసులకు కోర్టు ఝలక్

తమకు కౌంటర్ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని పోలీసుల తరఫు లాయర్ కోరారు. అయితే గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఆ తర్వాత కేవలం అరగంట సమయం ఇచ్చింది. అనంతరం పోలీసుల తరఫు లాయర్ వాదనలు వినిపించారు.

వీడియోలు కోర్టుకు ఎందుకివ్వలేదు, ఎఫ్ఎస్ఎల్‌కు ఎలా పంపిస్తారు

వీడియోలు కోర్టుకు ఎందుకివ్వలేదు, ఎఫ్ఎస్ఎల్‌కు ఎలా పంపిస్తారు

వీడియోలను ఎప్ఎస్ఎల్‌కు పంపిస్తున్నామని లాయర్ చెప్పారు. అయితే అసలు వీడియోలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని న్యాయస్థానం అడిగింది. కోర్టు అనుమతి లేకుండా ఎఫ్ఎస్ఎల్‌కు ఎలా పంపిస్తారని ప్రశ్నించింది.

ఏ2 పార్వతి పరారీలో ఉందని ఎలా చెబుతారు

ఏ2 పార్వతి పరారీలో ఉందని ఎలా చెబుతారు

ఈ కేసులో ఏ2 నిందితురాలు పార్వతిని పరారీలో ఉందని లాయర్ చెప్పగా, అలా ఎలా చెబుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు పరారీలో ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించింది.

English summary
Arguments on singer Ghazal Srinivas's bail peition in Nampally court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X