వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నా కథను పోర్న్ సినిమా చేశారు': 'అర్జున్ రెడ్డి'పై వైసిపి కూడా ఫైర్, వాళ్లు మరదళ్లంటూ..

అర్జున్ రెడ్డి సినిమా కథ తనది అని 'ఇక సె..లవ్' చిత్ర దర్శకులు నాగరాజు అన్నారు. లక్షణమైన తన అర్జున్ రెడ్డి కథను పోర్న్ సినిమాలా తయారు చేసి విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vijay Devarakonda’s Arjun Reddy lands into a fresh Controversy

ఖమ్మం: అర్జున్ రెడ్డి సినిమా కథ తనది అని 'ఇక సె..లవ్' చిత్ర దర్శకులు నాగరాజు అన్నారు. లక్షణమైన తన అర్జున్ రెడ్డి కథను పోర్న్ సినిమాలా తయారు చేసి విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇక సె..లవ్' ఫీచర్ ఫిల్మ్ నుంచి అర్జున్ రెడ్డి కథను దోచేశారన్నారు. అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది.

ఆ సినిమా పోస్టర్ల చించివేతతో మొదలైన వివాదం ఇప్పుడు చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం వరకు వచ్చింది. ఇప్పుడు తన కథను కాపీ కొట్టి సినిమా తీశారని డైరెక్టర్ నాగరాజు ఖమ్మంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్జున్ రెడ్డి ఇలా ట్రెండ్ సెట్

అర్జున్ రెడ్డి ఇలా ట్రెండ్ సెట్

వివాదాలు, ప్రశంసలతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్‌ చేసిన అర్జున్ రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే అంతే స్థాయిలో ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అర్జున్ రెడ్డిపై వైసిపి ఫిర్యాదు

అర్జున్ రెడ్డిపై వైసిపి ఫిర్యాదు

తాజాగా అర్జున్ రెడ్డి చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరోపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి నేత గౌతమ్ రెడ్డి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువత పెడదారి పట్టే విధంగా ఈ సినిమా ఉందని అర్జున్ రెడ్డి చిత్ర యూనిట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

రామ్ గోపాల్ వర్మ అండ

రామ్ గోపాల్ వర్మ అండ

ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఫేస్‌బుక్ వేదికగా కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంత రావును ఉద్దేశిస్తూ మరో కామెంట్ చేశారు. ఈ సినిమాలోని ముద్దు సీన్లంటినీ బాక్‌ టు బాక్ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకుని చిల్ అవుతారని చిత్ర యూనిట్‌కు సలహా ఇస్తూ వర్మ పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో అర్జున్ రెడ్డి సినిమాను మరోసారి చూశానని విజయ్ దేవరకొండ టాలీవుడ్ లియోనార్డర్‌డికాప్రియో అనడానికి ఎలాంటి సందేహం లేదని ప్రశంసించారు.

బంధువు కాబట్టే కెటీఆర్‌కు నచ్చింది

బంధువు కాబట్టే కెటీఆర్‌కు నచ్చింది

అంతకుముందు వి హనుమంత రావు.. అర్జున్ రెడ్డి సినిమాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో అనేక అభ్యంతర సీన్లు ఉన్నాయన్నారు. లిప్ లాక్, డ్రగ్స్ తీసుకుంటున్న సీన్లను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. ర్యాంగింగ్ చేసి, ప్రేమించి, గర్భవతిని చేసే సీన్లు ఉన్న సినిమాను చూసిన మంత్రి కేటీఆర్ సమాజం, యువతకు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు విజయ్ దేవరకొండ బంధువు కాబట్టే ఆ సినిమా ఆయనకు నచ్చినట్లుందని విమర్శించారు.

వీరు నా మరదళ్లు అని..

వీరు నా మరదళ్లు అని..

విహెచ్ వ్యాఖ్యలకు హీరో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అర్జున్ రెడ్డి సినిమాను ప్రశంసించిన కెటీఆర్ తనకు బంధువైతే మరి సినిమా నచ్చినవాళ్లంతా కూడా బంధువులవుతారా అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. రాజమౌళి తన నాన్న, హీరోలు రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్‌లు తన బ్రదర్స్ అంటూ పోస్ట్ చేశాడు. తనకు చెల్లెళ్లు ఉంటే ఫీలింగ్ ఎలా ఉండేదో తెలియదు కాబట్టి సమంత, అను ఇమ్యనూల్, మెహ్రీన్ పిర్జాదాలు తన మరదళ్లంటూ ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడు.

అప్పుడే విహెచ్ హంగామా

అప్పుడే విహెచ్ హంగామా

నిజానికి ఈ సినిమా పోస్టర్ విడుదల సమయంలోనే విహెచ్ ఆందోళనకు దిగారు. బస్సులపై అతికించిన పోస్టర్లను చించేశారు. సెన్సార్ బోర్డు ఎదుట విహెచ్ ధర్నా నిర్వహించారు. అర్జున్ రెడ్డి సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.

కథ నాదేనని నాగరాజు

కథ నాదేనని నాగరాజు

ఖమ్మంకు చెందిన నాగరాజు అనే దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమా కథ తనదే అని వాదిస్తున్నాడు. ఈ మేరకు మూవీ దర్శక నిర్మాతలకు నోటీసులు పంపాడు. తన కథతో తీసిన సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాక నష్టపరిహారంగా రూ.2కోట్లు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మహిళాసంఘాలు కూడా అర్జున్ రెడ్డి సినిమాను నిషేధించాలని పట్టుబడుతున్నాయి. ఈ సినిమాలో డ్రగ్స్, వల్గర్ సన్నివేశాలు యువతను చెడగొట్టేలా ఉన్నాయని మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

English summary
Vijay Devarakonda’s latest outing Arjun Reddy has been a smashing hit all over and the bold narration along with Vijay’s flawless performance has been widely lauded. However the movie landed into controversies because of the excessive kissing episodes and the cuss words used in the film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X