హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్పుల కలకలం: కస్టమర్‌లా వచ్చి.. కాల్చేసి పోయాడు, డబ్బు అలాగే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో సోమవారం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జియో సంసార్ అనే ప్రైవేట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీకి ఓ వ్యక్తి వచ్చాడు. 475 రూపాయలను ఓ వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేయాలన్నాడు. అందులో ఉన్న ఉద్యోగి సరేనంటూ పనిమొదలుపెట్టగానే తుపాకీతో కాల్చి.. ఏమీ ఎరుగట్లు అక్కడ్నుంచి పరారయ్యాడు.

అయితే, బాధితుడి దగ్గర ఉన్న రూ.3.75 లక్షల నగదునూ ముట్టుకోకపోవడం గమనార్హం. బాధితుడి విరోధులే ఈ పని చేసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన మున్నాతో కలసి కాటేదాన్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచి ఎదురుగా ఉన్న జియో సంసార్ సంస్థలో పనిచేస్తున్నారు. ఎస్‌బీఐకి ఫ్రాంచైజీగా ఉన్న ఈ సంస్థ ఆ బ్యాంకు ఖాతాదారుల నుంచి చిన్న మొత్తాల డిపాజిట్లు, బదిలీలను నిర్వహిస్తోంది.

రోజూ సాయంత్రం ఆ లావాదేవీల నగదును బ్యాంకు శాఖకు అప్పగిస్తారు. కాగా, ఈ జియో సంసార్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ వ్యక్తి కస్టమర్‌లా వచ్చాడు. అక్కడున్న ప్రసాద్‌తో బిహారీ యాసతో కూడిన హిందీలో మాట్లాడాడు. రోహిత్‌శర్మ అనే వ్యక్తి ఖాతాలోకి రూ.475 ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు.

దీంతో ప్రసాద్ పనిలో నిమగ్నమయ్యడు. వెంటనే తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ప్రసాద్ ఛాతీ భాగంలో కాల్చాడు దుండగుడు. ప్రసాద్ తేరుకునేలోపే పరారయ్యాడు. పెద్దగా చప్పుడు కాకపోవడంతో పక్కన ఉన్న దుకాణాల వారికి కూడా ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది నిమిషాలకు తేరుకున్న ప్రసాద్.. ఆ భవనంలోని మరో ఏజెన్సీ నిర్వాహకుడి దగ్గరకు వెళ్లాడు.

అతడు వెంటనే బైక్‌పై సమీపంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి డాక్టర్ల సలహా మేరకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ ఛాతీ భాగంలో దిగిన తూటా.. పొత్తికడుపులోకి జారిందని వైద్యులు నిర్ధారించారు. ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సాయంత్రం 5.30 గంటల సమయంలో సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జియో సంసార్ కార్యాలయాన్ని పరిశీలించి, సోమవారం నాటి లావాదేవీలకు సంబంధించిన రూ.3.75 లక్షలు భద్రంగా ఉన్నాయని గుర్తించారు. దీంతో దుండగుడు వచ్చింది దోపిడీ కోసం కాదని భావిస్తున్నారు. ప్రసాద్ వ్యక్తిగత చరిత్రను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాల్పులకు పాల్పడిన దుండగుడు ఆకుపచ్చ రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగుడి ఆనవాళ్లు లభించలేదు. అయితే ఘటనా స్థలానికి దారితీసే మార్గాలు, కూడళ్లలోని కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేగాక, కాల్పులు పాల్పడిన దుండగుడు నగదు బదిలీ చేయించిన రోహిత్ కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

గాయపడిన ప్రసాద్

గాయపడిన ప్రసాద్

కరీంనగర్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

కాల్పుల కలకలం

కాల్పుల కలకలం

రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన మున్నాతో కలసి కాటేదాన్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచి ఎదురుగా ఉన్న జియో సంసార్ సంస్థలో పనిచేస్తున్నారు. ఎస్‌బీఐకి ఫ్రాంచైజీగా ఉన్న ఈ సంస్థ ఆ బ్యాంకు ఖాతాదారుల నుంచి చిన్న మొత్తాల డిపాజిట్లు, బదిలీలను నిర్వహిస్తోంది.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

రోజూ సాయంత్రం ఆ లావాదేవీల నగదును బ్యాంకు శాఖకు అప్పగిస్తారు. కాగా, ఈ జియో సంసార్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ వ్యక్తి కస్టమర్‌లా వచ్చాడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

అక్కడున్న ప్రసాద్‌తో బిహారీ యాసతో కూడిన హిందీలో మాట్లాడాడు. రోహిత్‌శర్మ అనే వ్యక్తి ఖాతాలోకి రూ.475 ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. దీంతో ప్రసాద్ పనిలో నిమగ్నమయ్యడు. వెంటనే తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ప్రసాద్ ఛాతీ భాగంలో కాల్చాడు దుండగుడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ప్రసాద్ తేరుకునేలోపే పరారయ్యాడు. పెద్దగా చప్పుడు కాకపోవడంతో పక్కన ఉన్న దుకాణాల వారికి కూడా ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది నిమిషాలకు తేరుకున్న ప్రసాద్.. ఆ భవనంలోని మరో ఏజెన్సీ నిర్వాహకుడి దగ్గరకు వెళ్లాడు.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

అతడు వెంటనే బైక్‌పై సమీపంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి డాక్టర్ల సలహా మేరకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ ఛాతీ భాగంలో దిగిన తూటా.. పొత్తికడుపులోకి జారిందని వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సాయంత్రం 5.30 గంటల సమయంలో సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
An unidentified man fired one round from a country-made weapon at an employee of a private financial institution at Katedan in Mailardevpally on Monday afternoon. The condition of the injured man was stated to be critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X