వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ ఎన్నికలు: బీఫ్‌పై అసదుద్దీన్ సంచలన ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఫ్‌పై సంచలన ప్రకటన చేశారు. బీఫ్ కావాలంటే తమ పార్టీకి ఓటేయాలని ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే హైదరాబాదులో బీఫ్ తినే అవకాశం కోల్పోతామని ఆయన అన్నారు. బిజెపి, శివసేన కూటమి గెలిచినప్పుడు ముంబైలో వారం రోజుల పాటు బీఫ్ అమ్మకాలను నిషేధించారని ఆయన గుర్తు చేశారు. అందుకే బీఫ్ తినేవారు తమ పార్టీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్రారు.

 Asaduddin makes comments on beef

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమి గెలిస్తే బీఫ్ తినే అవకాశం ఉండదని ఆయన అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్నో అబివృద్ధి పనులు చేశామని ఆయన చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఫ్ ఎగుమతలు 17 శాతానికి పడిపోయాయని ఆయన చెప్పారు.

తమకు ఓటు వేస్తే ముంబైలాగా హైదరాబాద్ కూకుండా అడ్డుకుంటామని ఓవైసి చెప్పారు. మజ్లీస్ పాతబస్తీలో తిరిగి పాగా వేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇందులో భాగంగానే అసదుద్దీన్ ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.

English summary
MIM cheif and Hyderabad MP Asaduddin Owaisi called upon the voters to vote for his party to eat beef.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X