హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపితో జర భద్రం: కెసిఆర్‌కు ఓవైసీ సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మిషన్-7 స్టేట్స్ పేరుతో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని, కేసీఆర్ జీ జర జాగ్రత్త' అని మజ్లీస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

 Asaduddin Owaisi cautions KCR on BJP

బీజేపీ హిందూ రాజ్యస్థాపనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర ఏడు రాష్ట్రాల్లో అధికారం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో సంఘ్ పరివార్, బీజేపీ నేతల రాకపోకలు అధికమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమై 2019 ఎన్నికలపై దృష్టిపెట్టాలని సూచించారు.

 Asaduddin Owaisi cautions KCR on BJP

బీజేపీ ప్రభుత్వం ఒకవైపు దేశంలో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తుండగా, మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు 2020 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మారుస్తామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో హిందూ రాజ్యం కానివ్వమని అన్నారు. గుజరాత్ పోలీసులు అక్కడి యువకుల తలలపై టోపీలు పెట్టి వారితో ఇస్లాం జిందాబాద్ అని నినాదాలు చేయించి వీడియోలు తీసి సంఘవిద్రోహ శక్తులుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించడం సహించరానిదన్నారు.

కేంద్రానికి దమ్ముంటే ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పట్టుకోవాలన్నారు. దేశంలోని ముస్లింలందరూ భారతీయులేనని, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్‌కు శత్రువులైన వారు ఇక్కడి ముస్లింలకు కూడా శత్రువులేనన్నారు. సంఘ్‌పరివార్ శక్తులను రాజకీయంగా అడ్డుకుంటామన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఘర్ వాపసీపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం ఆక్రమిత భూములు, గృహాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన రెండు జీవోలను సవరించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశంలో కూడా ఈ జీవోలపై తాము అభ్యంతరం చెప్పామని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్ణయించినంత మొత్తాన్ని పేదలు చెల్లించలేరని, 250 గజాల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. నిజాం పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు చెప్పారు.

English summary
MIM president and Hyderabad MP Asaduddin Owaisi suggested Telangana CM K Chandrasekhar Rao to alert on BJP expansion plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X