వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలేరు ఎన్‌కౌంటర్‌పై అసద్, ఓ పార్టీ వల్లే: రాజాసింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులోని జనగామ - ఆలేరు మధ్యలో జరిగిన వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ పైన న్యాయవిచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు.

వరంగల్ నుండి హైదరాబాదుకు తీసుకొస్తున్న ఐదుగురు విచారణ ఖైదీలను పోలీసులు మార్గమధ్యంలో కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సూర్యాపేటలో పోలీసులను కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా ఉందన్నారు. పోలీసుల పైన కేసు నమోదు చేయాలన్నారు.

Asaduddin Owaisi demands probe into Telangana encounter

తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పార్టీలపై చర్యలేవి: రాజాసింగ్

హైదరాబాదులో ఓ రాజకీయ పార్టీ అండదండతో వేలాది మంది వికారుద్దీన్‌లు అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారని, జాతి విద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులు పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందిన అనంతరం ఆయన మాట్లాడారు.

వికారుద్దీన్ ముఠా ఎట్టకేలకు ఎన్ కౌంటర్లో హతమవ్వడం ప్రజలు ఊహిరిపీల్చుకునే సందర్భమన్నారు. హైదరాబాదులో ఓ రాజకీయ పార్టీ ముసుగులో ఆశ్రయం పొందుతూ దేశభద్రతకే పెను సవాలుగా పరిణమిస్తున్నారని ఆోందళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఓఠు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గంను మచ్చిక చేసుకోవడం వల్లనే నగరంలో ఇలాంటి శక్తులు పుట్టుకు వస్తున్నాయన్నారు.

English summary
Asaduddin Owaisi demands probe into Telangana encounter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X