హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేరు చేయలేరు: అమీర్ ఖాన్ వ్యాఖ్యలను తప్పు పట్టిన అసదుద్దీన్ ఓవైసీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలను మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. దేశం విడిచి వెళ్లిపోదామని తన భార్య అన్నట్లు అమీర్ ఖాన్ చేసిన ప్రకటనను ఆయన వ్యతిరేకించారు.

అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. పైగా, భారతదేశం వీడుతానని అనడం స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరని అసదుద్దీన్ స్పష్టం చేశారు. తాము భారత్‌ను వీడి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆయన తెలిపారు.

Asaduddin Owaisi rejects Aamir Khan comments
కాగా, అమీర్ ఖాన్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయాన్ని ముంబై సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మత అసహనంపై వెల్లువెత్తున్న విమర్శల నేపథ్యంలో అమీర్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని భద్రత ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

కాగా, సోమవారం ఢిల్లీలో జరిగిన గొయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ - దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు తమలో ఆందోళన పెంచుతున్నాయని, తన భార్య దేశం విడిచి వెళ్దామని సలహా కూడా ఇచ్చిందని అన్నారు.

పైగా 'ఐదేళ్లు అధికారంలో ఉండండి, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోండి' అని రాజకీయ నాయకులకు అధికారం ఇస్తే పరిస్థితులు చక్కబెట్టడం లేదు సరికదా, వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని అమీర్ పేర్కొన్నాడు.

English summary
MIM chief and Hyderabad MP Asadududdin Owaisi rejected bollywood actor Aamir Khan comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X