వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9వేలమంది అరెస్ట్.. కెసిఆర్ రికార్డ్!: కొట్టి ఈడ్చుకెళ్లారు, మహిళల కంటతడి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేతనాల పెంపు కోసం ఛలో అసెంబ్లీ పేరిట ఉద్యమించిన ఆశా వర్కర్ల పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ సహా పలుచోట్ల ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి అక్కడే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు.

ఈ క్రమంలో తోపులాటలు జరిగాయి. పలువురు ఆశా వర్కర్లకు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదివేల మందిని అరెస్టు చేశారు. సచివాలయం ముట్టడికి, జిల్లాల్లో ఆందోళనలకు ప్రయత్నించిన 8805 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ శుక్రవారం తెలిపారు.

ఇదిలా ఉండగా, చలో అసెంబ్లీకి ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు నిరాకరించారని తెలిసి... ఆగ్రహించిన మెదక్ జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు.. జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని ఫాంహౌస్‌లో సిఎం కెసిఆర్ ఉన్నారని తెలిసి.. ఓ పదిహేను మంది ఆటోలో ఫాంహౌస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఫాంహౌస్ సమీపంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

చలో హైదరాబాద్‌ పేరుతో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. హైదరాబాద్‌లో వారు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ నగరానికి వచ్చిన వారిని వచ్చినట్లే వాహనాల్లో ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

దీనికోసం పోలీసులు ముందుగానే నగరం, శివారు ప్రాంతాల్లోని బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పెద్దఎత్తున మోహరించారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

పోలీసుల నుంచి తప్పించుకుని ప్రైవేటు బస్సుల్లో ఇందిరా పార్కుకు చేరుకుంటున్న 1,600మందిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

పోలీసులు తమను లాఠీలతో కొడుతూ చేతులు పట్టి ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారని కొందరు ఆశా వర్కర్లు కంటతడి పెట్టారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

తన సొంత బిడ్డలా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరినీ చూసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఇదే ఆడబిడ్డలను అరెస్టులు చేయించి రోడ్లపై ఈడ్చడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

న్యాయమైన తమ కోర్కెలను సాధించుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కష్టజీవులైన ఆశా వర్కర్ల సమస్యలపట్ల ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్‌ కె లక్ష్మణ్‌, తెలంగాణ టిడిపిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు, తదితరులు గోషామహల్‌ స్టేడియంలో ఆశా వర్కర్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

కెసిఆర్ కూతురు కవిత బతుకమ్మ ఆటల కోసం రూ.20 కోట్లు అయినా క్షణాల్లో మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి.. ఆశా వర్కర్లు అయిన మహిళలు నలభై రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే తీరిక లేకుండా పోయిందా అని విపక్ష నేతలు ప్రశ్నించారు.

ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

బిజెపి శానససభాపక్ష నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సర్కారు ప్రయత్నించకపోవటం శోచనీయమన్నారు.

ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

రైతుల కోసం శనివారం తలపెట్టిన బంద్‌లో ఆశా వర్కర్లు కూడా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

 ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... ఇంత పెద్ద సంఖ్యలో మహిళల్ని అరెస్టు చేసిన ఘనత నిజాం పాలనలోనూ లేదన్నారు. దానిని సీఎం కేసీఆర్‌ సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఆశా వర్కర్ల అరెస్ట్

ఆశా వర్కర్ల అరెస్ట్

తెలంగాణవ్యాప్తంగా వేలాది మంది ఆశా వర్కర్లు అయిన మహిళల్ని అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించడం ఎంత వరకు సమంజసమో కేసీఆర్‌కే తెలియాలన్నారు.

English summary
A ‘chalo Assembly’ programme of ASHA demanding hike in minimum wages and recognition as auxiliary nursing midwives led to tension at RTC crossroads here on Friday when a large group of women squatted on the road and entered into a scuffle with the police as they tried to clear them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X