కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాకీ వడ్డీల దందా: వెలుగులోకి బినామీలు, రవివర్మ పర్యటనపై ఆసక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌ రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారంపై సిఐడి తన విచారణలో దూకుడు పెంచింది. వివిధ కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను, బాధ్యులను గుర్తించడానికి ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఐజీ రవివర్మ జిల్లాలో పర్యటించారు. మోహన్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో ముగ్గురు పుర్మ శ్రీధర్‌ రెడ్డి, జలంధర్‌ రెడ్డి, శైలెందర్‌ రెడ్డి సీఐడీ పోలీసుల ఎదుట లొంగిపోయి విచారణకు సహకరించినట్లు తెలుస్తోంది,

మోహన్ రెడ్డి డ్రైవర్‌ శ్రవణ్‌ను కూడా అదుపులోకి తీసుకుని ఆదివారం విచారించినట్లు తెలుస్తోంది. వీరి విచారణలో మోహన్‌రెడ్డికి పె ట్టుబడులు పెట్టిన, వ్యాపారంలో సహకరించిన మరికొందరు పోలీసు అధికారుల పేర్లు వెల్లడైనట్లు సమాచారం. మోహన్‌ రెడ్డి తన నేర అంగీకార నివేదికలో పేర్కొన్న పోలీసు అధికారులు, ఉద్యోగులందరిపై త్వరలోనే వేటు పడక తప్పదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ వ్యవహారంలో అడిషనల్‌ ఎస్పీ బి జనార్దన్‌రెడ్డితోపాటు డీఎస్పీలు సంజీవ్‌కుమార్‌, భాస్కర్‌పై బదిలీ వేటు పడగా, మిగతా వారందరిపై త్వరలోనే చర్యలు ఉంటాయని అంటున్నారు. విచారణకు వారు హాజరయ్యేలా చూసేందుకే వారిపై ఇప్ప టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ పూర్తి కాగానే వెల్లడైన విషయాల ఆధారంగా వేటు వేసే అవకాశముందని చెబుతున్నారు.

ASI Mohan reddy issue: DIG Ravi verma visits karimnagar

డీఐజీ రవి వర్మ ఆదివారం జిల్లాలో పర్యటించి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మోహన్‌రెడ్డి వడ్డీ వ్యాపారంలో పోలీసుల పా త్ర ఎంత? కెన్‌క్రెస్ట్‌ యజమాని ఆత్మహత్యలో మోహన్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని, రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని డీఐజీ ప్రకటించారు.

ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులు విచారణలో వెల్లడైన అంశాలను తెలుసుకుంటుండడంతో పాటు వరంగల్‌ ఐజీ నవీన్‌ చంద్‌, సీఐడీ డీఐజీ రవివర్మ వరుసగా జిల్లాలో పర్యటించి వెళ్లడం వంటి పరిణామాలు వ్యవహారాన్ని చాలా తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నాయి.

కొందరు పోలీసు అధికారుల పెట్టుబడులతో అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఏఎ్‌సఐ మోహన్‌రెడ్డి కేసును హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారంలో కొంత మంది పోలీసు అధికారులు, ఇతరులను ఉద్దేశపూర్వకంగానే తప్పిస్తున్నారని, రాజకీయ అండదండలను బయటికి రాకుండా వ్యవహరిస్తున్నారని తమ నిజనిర్థారణలో తేలిందని పౌర హక్కుల సంఘం నాయకులు మాదాసు కుమారసామి, ఏనుగు మల్లారెడ్డి ఆరోపించారు. గడిచిన 15 సంవత్సరాలలో ఎస్‌ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పని చేసిన పోలీసు అధికారుల ఆస్తులపై విచారణ జరపాలని వారు డిమాండ్‌ చేశారు.

English summary
It is said that ASI Mohan Reddy has harassed so many people lending money. Karimnagar ASI Mohan Reddy arrested and remanded till November 27th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X