కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోహన్ రెడ్డి ఖాకీ వడ్డీ దందా: సహకరించినవారు, అప్పులు తీసుకున్నవారు వీరే...

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి తన అక్రమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చిట్టాను విప్పినట్లు సమాచారం. మోహన్‌రెడ్డికి నమ్మినబంటు, ఫైనాన్స్ అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ (59)తో సహా మరో బినామీ సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి (39)లను గురువారం సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి డిసెంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి అజార్ హుస్సేన్ ఉత్తర్వులు జారీచేశారు.

ఎఎస్‌ఐ ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టినవారి పేర్లను, సహకరించిననువారి పేర్లను, అప్పులు తీసుకున్నవారి పేర్లను సిఐడి విచారణలో జ్ఞానేశ్వర్ వెల్లడించాడు. ఇందులో ముగ్గురు పోలీసు అధికారులు, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక సబ్ రిజిష్ట్రార్ ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు పోలీసు అధికారులు పెట్టుబడులు పెట్టగా, తాజాగా గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.బి.పి.నాయుడు (20లక్షలు) పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులు సహకరించగా, తాజాగా డిఎస్పీ హబీబ్‌ఖాన్, చొప్పదండి సిఐ లక్ష్మిబాబు దందాకు సహకరించినట్లు వెల్లడించాడు.

కరీంనగర్ నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ వి.సూర్యనారాయణరెడ్డి (రూ.90లక్షలు), సబ్ రిజిష్ట్రార్ మల్లిఖార్జున్ (రూ.20లక్షలు), లాయర్ బద్దం రాంరెడ్డి (రూ.10లక్షలు), పద్మ (50లక్షలు), సుజాత (20లక్షలు) పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించాడు. మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌లో అప్పులు తీసుకున్న వారిలో రియల్టర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉన్నారు.

ASI Mohan Reddy's illegal finance business: More involved

జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి (రూ.10.30లక్షలు), టిఆర్‌ఎస్ నేత దాది సుధాకర్ (రూ.74.60లక్షలు), టిఆర్‌ఎస్ మహిళా నేత కాలిదాసు రేణుక (రూ.47.65లక్షలు), రియల్టర్ కొండాల్‌రెడ్డి (రూ.80లక్షలు), వెంకటేశ్వర లాడ్జి యజమాని సోమ సురేష్ (రూ.70లక్షలు)తోపాటు పలువురు అప్పులు తీసుకున్నట్లుగా జ్ఞానేశ్వర్ వెల్లడించాడు.

ఈ దందాతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది పోలీసు అధికారులపై ఇప్పటికే వేటు పడగా, తాజాగా మరో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు వెలుగుచూడడంపై పోలీస్ శాఖను కుదేపిసింది. మోహన్‌రెడ్డి కేసులో ఇప్పటివరకు మోహన్‌రెడ్డితో సహా 11మందిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మోహన్‌రెడ్డి, ఆయన అనుచురులు, బినామీలపై ఉన్న ఆస్తులు ఇతరులకు మార్పులు చేర్పులు చేయవద్దని కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లేఖలు రాసిన సిఐడి అధికారులు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేయాలని బ్యాంకులకు సైతం లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

ASI Mohan Reddy's illegal finance business: More involved

మరోవైపు కెన్‌క్రెస్ట్ ప్రసాదరావు ఆత్మహత్యకు ఎఎస్‌ఐ బెదిరింపులే కారణమని కేసు నమోదు కాగా, మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే ఆయనకు సంబంధించిన రెండు సెల్‌పోన్లు, ప్రసాదరావు కుమారుడు అత్రేష్ సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మూడు సెల్‌ఫోన్లలో రికార్డు అయిన స్వర నిర్ధారణ కోసం సిఐడి అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

సిఐడి దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే ఆదాయశాఖ, ఈడి అధికారులు సైతం మోహన్‌రెడ్డి దందాపై దృష్టి సారించారు. ఇప్పటికే అన్ని వివరాలు సేకరించిన ఈ శాఖలు నేడోరేపో వారికి నోటిసులు కూడా జారీచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

English summary
Karimanagar ASI Mohan Reddy's finance accountant Jnaneswar has revealed the details of illegal finance business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X