వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీ వ్యాపారం చేయలేదు, వేయి కోట్లేం సంపాదించలేదు: ఎఎస్ఐ మోహన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తాను ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారం చేయలేదని కరీంనగర్ ఎఎస్ఐ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వడ్డీ వ్యాపారం చేస్తూ పలువురిని తుపాకులతో బెదిరించి ఆస్తులు కాజేశాడనే ఆరోపణపై ఆయన మీద కేసులు నమోదైన విషయం తెలిసిందే.

తాను వేయి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాననే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తన ప్రతి పైసాకు ఐటి లెక్కలు ఉన్నాయని చెప్పారు. తన పూర్వీకుల భూమితో ఆస్తులు సంపాదించానని చెప్పారు. కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడుతానని చెప్పారు. తాను తుపాకితో బెదిరించినట్లు చేసిన ఆరోపణలో కూడా నిజం లేదని చెప్పారు.

ఎఎస్ఐ సంపాదన వంద కోట్లా: న్యాయమూర్తి విస్మయంఎఎస్ఐ సంపాదన వంద కోట్లా: న్యాయమూర్తి విస్మయం

తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు బాధితులు హైదరాబాదు నగరంలోని ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు బాధితుల సంఘం అధ్యక్షడు మహేందర్ రెడ్డి చెప్పారు.

AsI Mohan reddy says he never involved in finance business

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జిచే ఈ కేసును విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఆస్తులను మాకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన బాధితుల సంఘం డిమాండ్ చేసింది. ఆయన అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా సీఐడీ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బొబ్బల మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యాపారం పేరిట వంద కోట్ల రూపాయలకు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితులు పేర్కొన్నారు.

మోహన్ రెడ్డి వడ్డీ దందా: తుపాకితో బెదిరించి ఇల్లు ఖాళీ చేయించారటమోహన్ రెడ్డి వడ్డీ దందా: తుపాకితో బెదిరించి ఇల్లు ఖాళీ చేయించారట

మోహన్‌రెడ్డి కేసు విషయంలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉందని ఆరోపించారు. అందుకే ఈ కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బాధితుల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుసుకోవాలని కోరారు.

English summary
Karimnagar ASI Mohan Reddy said that he has not involved in finance business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X