కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీబీఐ ఎంక్వైరీ: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు బాధితులు నగరంలోని ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు బాధితుల సంఘం అధ్యక్షడు మహేందర్ రెడ్డి చెప్పారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జిచే ఈ కేసును విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఆస్తులను మాకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన బాధితుల సంఘం డిమాండ్ చేసింది. ఆయన అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా సీఐడీ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బొబ్బల మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యాపారం పేరిట వంద కోట్ల రూపాయలకు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితులు పేర్కొన్నారు.

మోహన్‌రెడ్డి కేసు విషయంలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉందని ఆరోపించారు. అందుకే ఈ కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బాధితుల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుసుకోవాలని కోరారు.

మోహన్‌రెడ్డి అతని బినామీలు, గూండాల నుండి బాధితలుకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా వడ్డీ వ్యాపారం ద్వారా కరీంనగర్ ఎఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలను సంపాదించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.

 రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీలకు తిప్పుతుండడమే కాకుండా వడ్డీ కోసం తీవ్రమైన ఒత్తిడి పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యాడని మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. కరీంనగర్‌కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు మోహన్ రెడ్డి వద్ద 75 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు.

 రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్ రెడ్డి ఒత్తిడి పెట్టాడు. దీంతో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్ రెడ్డి, తదితరులు తన ఆత్మహత్యకు బాధ్యులని ప్రసాదరావు తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు.

రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు అంగీకరించకపోవడంతో మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఏఎస్సై మోహన్‌రెడ్డిపై ఇప్పటి వరకు 62 కేసులు నమోదయ్యాయి.

 రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

రిలే నిరాహార దీక్షలు: రోడ్డెక్కిన ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు

సుమారు 134 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. సుమారు 200 మంది బాధితులు ఏఎస్సై మోహన్‌రెడ్డిపై కేసు పెట్టిన వారిలో ఉన్నారు. రాష్ట్ర సీఐడీలో ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉద్యోగిగా ఉండటం వల్లే కేసును నత్తనడకన దర్యాప్తు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

English summary
Members of the ‘ASI Mohan Reddy Victims Association’ from Karimnagar have demanded that the case against the police official, now being investigated by the state CID, should be transferred to the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X