హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసియా ఆంద్రాబీ హైదరాబాద్ పర్యటించిందా: డిజిపి ఏమంటున్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆంద్రాబీ హైదరాబాద్‌లో పర్యటించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ వార్తలపై తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు. ఆంద్రాబీ హైదరాబాదులో పర్యటించినట్లు వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు.

ఆమె హైదరాబాద్ వచ్చినట్లు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె రాకను ధ్రువీకరించాల్సి ఉందని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని ఆయన అన్నారు. నాగపూర్‌లో పట్టుబడిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఆంద్రాబీని కలిశారనే విషయంపై కూడా తమ వద్ద సమాచారం లేదని డిజిపి చెప్పారు.

కాశ్మీర్ వివాదాస్పద మహిళా నాయకురాలు ఆంద్రబీ నిరుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిమీ వ్యవస్థాపకుడు సలావుద్దీన్ కుటుంబాన్ని ఆమె కలిసినట్లు చెబుతున్నారు. కాగా, ఇటీవల ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ముగ్గురు హైదరాబాద్ యువకులు కూడా ఆమెను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

Asiya Andrabi visited Hyderabad: reacts DGP

ఆసియా అంద్రాబీ ధక్థరాన్ - ఎ - మిల్లత్ (డిఇఎం- జాతీ కూతుళ్లు) వ్యవస్థాకురాలు. కాశ్మీర్‌లోని ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌లో అది ఓ అంతర్భాగం. భారత్‌ను స్వేచ్ఛ పొంది ప్రత్యేక కాశ్మీర్ ఏర్పాటుకు ఇది పనిచేస్తుంది.

ఆమె హిజుబుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకతను అయిన ఆషిక్ హుస్సేన్ ఫక్తూ భార్య కూడా. నాగపూర్‌లో అబ్దుల్ బాసిత్, సయ్యద్ ఒమర్, మాజ్ హుస్సేన్ అనే ముగ్గురు యువకులను గత వారం పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Telangana DGP Anurag Sharma said that there is no information on Asiya Andrabi's Hyderabad visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X