వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన ప్రచారపర్వం.. మిగిలింది ప్రలోభాలే... ఎల్లుండే పోలింగ్.. ఈసీ నిఘానీడలో...

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార హోరు ఆగిపోయింది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా 51 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్థానికేతరులను వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేసింది.

మూగబోయిన మైకులు

మూగబోయిన మైకులు

హుజూర్‌నగర్‌లో ప్రచారబరి పరిసమాప్తమయ్యింది. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర మహాశయులను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసీ నిఘానేత్రం ఉన్న నేపథ్యంలో భారీగా నగదు, మద్యం పట్టుబడే అవకాశం ఉంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

బరిలో 28 మంది

బరిలో 28 మంది

టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో ఉన్న అంత ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ వీరిద్దరూ మాత్రం ఓట్లు చీల్చడంతో అభ్యర్థి విజయాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. మరోవైపు తీన్మార్ మల్లన్న.. కేయూ, ఓయూ విద్యార్థి నేతలు కూడా ఓట్లు చీల్చనున్నారు. ఈ ఓట్ల చీలిక ఏ పార్టీకి అనుకూలమో, ప్రతికూలమో అన్న అంశం ఉత్కంఠకు దారితీసింది.

 144 సెక్షన్

144 సెక్షన్

ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో 144 సెక్షన్ విధించారు. సోమవారం పోలింగ్ జరగనుండగా .. 24న ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర, హర్యానాలో కూడా పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ అధికార బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్నాయి. విజయంపై ఆ కూటమి ధీమాతో ఉంది. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రచారం కూడా చప్పగానే సాగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధికారం కోసం

అధికారం కోసం

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఉద్దండులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, కశ్మీర్ విభజన అంశం ఆధారంగా విమర్శలు గుప్పించారు. చివరిరోజు ప్రధాని మోడీ హర్యానాలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాగాంధీ తరఫున రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. సోనియా అనారోగ్యంతో బాధపడటంతో రాహుల్ క్యాంపెయిన్ చేశారు.

English summary
maharashtra, haryana assembly, 51 assembly consistency by poll campaign end on saturday 5pm. election commission prepare for poll on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X