వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి ఓవైసి చురకలు: బిజెపిని ఓడించాలంటే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైస్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి గెలిచిన నేపథ్యంలో ఆయన కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చురకలు అంటించారు.

గుజరాత్‌లో ముస్లింలను ఏకాకులను చేసినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోందని ఆయన అన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఆలయాల చుట్టూ తిరిగారని ఆయన అన్నారు.

మరో బిజెపిగా మారడం కాదు..

మరో బిజెపిగా మారడం కాదు..


"మరో బిజెపిగా మారడం ద్వారా నువ్వు బిజెపిని ఓడించలేవు. నీకూ బిజెపికి మధ్య తేడా ఏమిటో చూపించాల్సి ఉంటుంది" అని ఓవైసీ అన్నారు. గుజరాత్‌లో బిజెపిని ఓడించడానికి కాంగ్రెసుకు అద్భుతమైన అవకాశం వచ్చిందని, అయితే కాంగ్రెసు విఫలమైందని అన్నారు.

అయినా అక్కడ బిజెపి...

అయినా అక్కడ బిజెపి...

సూరత్‌ వ్యాపారుల కూడలి అని, జిఎస్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ బిజెపి విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో బిజెపి ఓ యంత్రంలా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. కూటమి కడితే తప్ప బిజెపిని ఓడించలేమని అన్నారు.

ఎవరైనా కావచ్చు గానీ...

ఎవరైనా కావచ్చు గానీ...

అఖిలేష్ యాదవ్ కావచ్చు, అసుద్దీన్ ఓవైసీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఎవరైనా ఒంటరిగా బిజెపిని ఓడించలేరని, బిజెపిని ఓడించడానికి ఉమ్మడి కూటమి కట్టడం అవసరమని ఓవైసీ అన్నారు.

బిజెపికి ఓవైసీ సలహా...

బిజెపికి ఓవైసీ సలహా...

గెలుపు మోజులో ఉన్న బిజెపికి కూడా ఆయన హెచ్చరిక చేశారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న కాలంలో కూడా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీని ప్రజలు ఓడించారని గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజానీకమే ప్రతిపక్షం అవుతుందని, అలా పార్టీలను, నాయకులను ఓడించిందని ఆయన అన్నారు. గుజరాత్‌లో చాలా చేశామని బిజెపి మురిసిపోతుంటే దానిపై ఓసారి పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

English summary
BJP secured a comfortable majority in both Gujarat and Himachal Pradesh Assembly elections, Asaduddin Owaisi said that the results show that Muslim marginalisation has increased in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X