వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపమందు కూడా బ్లాక్ లోనా..? హ‌్రుద్రోగుల ఆవేద‌న‌...

|
Google Oneindia TeluguNews

Recommended Video

చేప మందు కోసం బారులు తీరిన జనం

హ్రుద్రోగుల‌కు ప్రియ‌మైన చేప‌మందు ఈ సారి చాలా "ప్రియం " గా మారింది. ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఉచితంగా పంపిణీ చేసే చేప‌మందు ఈ సారి అర‌కొర‌గా పంపిణీ చేసార‌ని నాంప‌ల్లి గ్రౌండ్స్ కి చేరుకున్న హ్రుద్రోగులు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సుదీర ప్రాంతాల నుండి వ‌చ్చిన త‌మ‌కు చేప పిల్ల‌ల‌ను బ్లాక్ లో కొనుక్కోవ‌డం విస్మ‌యానికి గురిచేసింద‌ని బాధ‌ను వెళ్ల‌గ‌క్కారు. దూర ప్రాంతాల‌నుండి వ‌చ్చేవారి కోసం మ‌రికొన్ని సౌర‌ర్య‌లు క‌ల్పిస్తే బాగుండేద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు నాంప‌ల్లి ఎగ్సిబిష‌న్ గ్రౌండ్స్ కి చేరుకున్న హ్రుద్రోగులు.

చేపమందు కోసం భారీ క్యూ, ఇతర రాష్ట్రాల నుంచి జనాలు (ఫోటోలు)

బ‌త్తిన సోద‌రుల ఉచిత చేప‌మందు .. ఈ సారి ఖ‌రీదైన చేప‌మందుగా మారింది

బ‌త్తిన సోద‌రుల ఉచిత చేప‌మందు .. ఈ సారి ఖ‌రీదైన చేప‌మందుగా మారింది

చేప మందు.. ఆ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ ఉంది. ప్ర‌తి మ్రుగ‌శిర కార్తె ప్రారంభం రోజున బ‌త్తిన సోద‌రులు ఇచ్చే ఈ చేప మందుకు హ్రుద్రోగుల్లో మంచి విశ్వాసం ఉంది. దీర్గ కాలంగా ఆస్త‌మా, ద‌గ్గు తో బాద‌ప‌డుతున్న రోగులు ఈ చేప మందును సేవిస్తే చ‌క్క‌ని ఉప‌శ‌మ‌నం ఉంటుంద‌ని వ్యాది గ్ర‌స్తుల్లో ప్ర‌గాఢ న‌మ్మకం.

అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మ‌ద్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ నుండి హ్రుద్రోగులు ఎక్కువ సంఖ్య‌లో చేప‌మందుకోసం న‌గ‌రానికి రావ‌డం జ‌రుగుతోంది. ప్ర‌తి సంవ‌త్స‌రం మ్రుగ‌శిర కార్తె రోజునే కాకుండా ఆ మ‌రుస‌టి రోజు కూడా ఈ చేప‌మందును అందిచ‌డం జ‌రుగుతుంది. న‌గ‌రంలోని నాంప‌ల్లి ఎగ్సిబిష‌న్ మైదానంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి రెండు రోజుల్లో ల‌క్ష మందికి పైగా చేరుకోవ‌డం జ‌రుగుతుంది.

ఇక్క‌డ కూడా బ్లాక్ మార్కెట్ గాళ్ల‌దే రాజ్యం.. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని వైనం..

ఇక్క‌డ కూడా బ్లాక్ మార్కెట్ గాళ్ల‌దే రాజ్యం.. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని వైనం..

ప్ర‌భుత్వ ప‌రంగా కూడా చేప‌మందుకోసం వ‌చ్చే వారికి సౌక‌ర్యాల‌ను క‌ల్పింస్తోంది. అత్య‌వ‌స‌ర వైద్య శిబిరాలు, త్రాగునీరు, ఆంబులెన్స్, అగ్నిమాప‌క, జీహెచ్ఎంసీ, వాట‌ర్ వ‌ర్క్, బ‌ల్దియా, విద్యుత్ తో పాటు పోలీసు సిబ్బంది కూడా పెద్ద యెత్తున నాంప‌ల్లి ఎగ్సిబిష‌న్ మైదానానికి చేరుకుని ప‌రిస్తితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తుంటారు.

అంతే కాకుండా స్వ‌చ్చంద సంస్థ‌లు నాంప‌ల్లి మైదానానికి చేరుకున్న ప్ర‌జ‌ల‌కోసం బోజ‌న స‌దుపాయాల‌ను కల్పించ‌డం విశేషం. బ‌త్తిన హ‌రినాథ్ గౌడ్ సోద‌రులు ప్ర‌తి యేటా ఉచితంగా పంపిణీ చేసే చేప మందు ప్ర‌క్రియ ప‌ట్ల ఈ సారి ప్ర‌జ‌ల‌నుండి కొంత అసంత్రుప్తి వ్య‌క్తం అవుతోంది. చేప‌ల‌ను మామూలుగా 10 రూపాయ‌ల‌కు కాకుండా బ్లాక్ లో విక్ర‌యిస్తూ ఒక చేప‌కు 50 నుండి 70 రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం ఇబ్బందిగా ఉంద‌ని, ప్ర‌భుత్వ అదికారులు ఇలాంటి దోపిడీ దారుల‌ను అరిక‌ట్ట‌డంలో విఫ‌లం చెందారని కొంత మంది ప్ర‌జ‌లు వాపోయారు.

స‌దుపాయాలు మ‌రింత మెరుగ్గా ఉంటే బాగుండేది..

స‌దుపాయాలు మ‌రింత మెరుగ్గా ఉంటే బాగుండేది..

అంతే కాకుండా చేప‌మందుతో పాటు వేసుకునే ప‌దార్థాన్ని కూడా బ్లాక్ లో విక్ర‌యించ‌డం అయోమ‌యానికి గురి,చేసింద‌ని మ‌రి కొంత మంది వాపోయారు. చేప‌మందు కౌంట‌ర్ల ద‌గ్గ‌ర మ‌రి కొంత మంది వాలంటీర్ల‌ను ఏర్పాటు చేసి ఏది ఎక్క‌డ దొరుకుతుందో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేద‌నే అభిప్రాయాన్ని మ‌రికొంత మంది వ్య‌క్తం చేసారు. దూర ప్రాంతాల‌నుండి వ‌చ్చే ప్ర‌జ‌లే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌నుండి వ‌చ్చే రోగులు కూడా ఏది ఎక్క‌డ ల‌భ్య‌మౌతుందో అర్థం కాక ఇబ్బందులు ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. చేప‌మందు పంపిణి ద‌గ్గ‌ర పోలీసులు అన‌వ‌స‌ర‌పు హడావిడి చేయ‌డం వ‌ల్ల కొంత గంద‌గోళ ప‌రిస్ధితులు త‌లెత్తాయ‌ని అన్నారు.

ప్ర‌హ‌స‌నంలా కాకుండా ప్రాక్టిక‌ల్ గా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది..

ప్ర‌హ‌స‌నంలా కాకుండా ప్రాక్టిక‌ల్ గా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది..

ప్ర‌భుత్వ అదికారుల నుండి మ‌రికొంత స‌హ‌కారం ల‌భించి ఉంటే ఇంకా చాలా మంది హ్రుద్రోగుల‌కు చేప‌మందు ల‌భించి ఉండేద‌ని తెలుస్తోంది. రెండు రోజులు సంపూర్తిగా కొన‌సాగాల్సిన చేప‌మందు ప్ర‌క్రియ‌ను హ‌డావిడిగా ఎందుకు ముగింస్తున్నారో.. దూర ప్రాంతం నుండి వ‌చ్చే వారిని చాలా వ‌ర‌కు ఎందుకు వెన‌క్కి పంపిచారో అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని అక్క‌డ‌కు వ‌చ్చిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం జ‌రిగింది. ముఖ్యంగా చేప‌ల‌ను, చేప‌తో పాటు వేసుకునే మందును బ్లాక్ లో విక్ర‌యించ‌డం వంటి అంశాలు బాదించాయ‌ని, అలాంటి ద‌లారుల‌పైన పోలీసులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవడం విచార‌క‌ర‌మ‌ని హ్రుద్రోగులు వివ‌రించారు.

English summary
every year in mrugasira season the famous bathina harinath goud brothers distributes fish medicine for asthma patients freely. this time also battina brothers started distrbuting the medicine in the nampally exhibition grounds. but many of the people came from the distance and inter states suffered due to lack of facilities. more over the free fish medicine became much expensive due to block block market. police and government officials failed to contole the brokers in the nampally exhibition grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X