వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టహాసంగా ఆటా వేడుకలు: కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తానన్న మంత్రి ఇంద్రకరణ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, భాషా వ్యాప్తిని ప్రవాస తెలుగువారు కాపాడుకుంటూ వస్తున్నారని, కళా, సాహిత్యం, సేవారంగాలలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమవంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమని ఆయన అన్నారు.

వచ్చే జూలై 1, 2, 3 తేదీలలో అమెరికా షికాగోలో జరిగే ఆటా రజతోత్సవ సభలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఆటా రజతోత్సవాల సంబరాలలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఒకరోజు ఉత్సవాన్ని నిర్వహించారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ కె స్వామిగౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం, ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక సలహాదారు డాక్టర్ పద్మజా రెడ్డి, ఓవర్సీస్ సమన్వయకర్తలు పి హరినాథ్ రెడ్డి, డాక్టర్ సురేందర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోని 15 దేశాలలో బతుకమ్మ, బోనాల పండుగలు నిర్వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడంలో తెలంగాణ ఉద్యమం కీలకపాత్ర పోషించిందని అన్నారు. సేవారంగంలో ఆటా చేస్తున్న కృషి వల్ల ఎంతోమంది పేద, ప్రతిభగల విద్యార్థులకు మేలు జరుగుతున్నదని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవాస తెలంగాణీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నదని, వారి సాధకబాధకాలతో పాటు వారి సేవలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణ, జానపద కళాకారుడు గోరటి వెంకన్న, ఒగ్గుకథ కళాకారుడు చుక్కా సత్తయ్య, పౌరాణిక, పద్య నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, సంఘ సేవకి సామ్రాజ్యం, ఐఆర్ఎస్ అధికారి సునీత, రవీందర్‌రెడ్డి, బసిరెడ్డి, తదితరులను ఆటా విశిష్ట పురస్కారాలతో సత్కరించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, భాషా వ్యాప్తిని ప్రవాస తెలుగువారు కాపాడుకుంటూ వస్తున్నారని, కళా, సాహిత్యం, సేవారంగాలలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమవంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమని ఆయన అన్నారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

వచ్చే జూలై 1, 2, 3 తేదీలలో అమెరికా షికాగోలో జరిగే ఆటా రజతోత్సవ సభలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఆటా రజతోత్సవాల సంబరాలలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఒకరోజు ఉత్సవాన్ని నిర్వహించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఆటా రజతోత్సవాల సంబరాలలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఒకరోజు ఉత్సవాన్ని నిర్వహించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ కె స్వామిగౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బి వెంకటేశం, ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక సలహాదారు డాక్టర్ పద్మజా రెడ్డి, ఓవర్సీస్ సమన్వయకర్తలు పి హరినాథ్ రెడ్డి, డాక్టర్ సురేందర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోని 15 దేశాలలో బతుకమ్మ, బోనాల పండుగలు నిర్వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడంలో తెలంగాణ ఉద్యమం కీలకపాత్ర పోషించిందని అన్నారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

సేవారంగంలో ఆటా చేస్తున్న కృషి వల్ల ఎంతోమంది పేద, ప్రతిభగల విద్యార్థులకు మేలు జరుగుతున్నదని కొనియాడారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవాస తెలంగాణీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నదని, వారి సాధకబాధకాలతో పాటు వారి సేవలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఆటా తెలంగాణ మట్టి వాసనను కోల్పోకుండా గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అన్నారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

తెలంగాణలోని కళాకారులను సత్కరించడం కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమ పాటలను వినిపించడానికి ఆటా వేదికగా ఉపయోగపడిందని చెప్పారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఆటా ఎలక్ట్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అపిరెడ్డి మాట్లాడుతూ.. గత 15 రోజులుగా వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రవాస తెలుగువారికోసం హైదరాబాద్‌లో ప్రవాసభవన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణ, జానపద కళాకారుడు గోరటి వెంకన్న, ఒగ్గుకథ కళాకారుడు చుక్కా సత్తయ్య, పౌరాణిక, పద్య నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, సంఘ సేవకి సామ్రాజ్యం, ఐఆర్ఎస్ అధికారి సునీత, రవీందర్‌రెడ్డి, బసిరెడ్డి, తదితరులను ఆటా విశిష్ట పురస్కారాలతో సత్కరించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఈ సందర్భంగా పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఆటా రజతోత్సవ సభలలో అవకాశం కల్పిస్తారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు పెరికారి సుధాకర్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అసిరెడ్డి కరుణాకర్, కల్చరల్ అడ్వైజర్ పద్మజారెడ్డి, కో-ఆర్డినేటర్ కరుణాహరినాథరెడ్డి, పెద్ద ఎత్తున ఆటా సభ్యులు పాల్గొన్నారు. జూలైలో నిర్వహించే సభల గురించి కరుణాకర్ వివరించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

డాక్టర్ పద్మజారెడ్డి బృందం ప్రదర్శించిన ‘సేవ్ గర్ల్ చైల్డ్' కూచిపూడి నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు చేసిన జానపద నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఆట పాటలతో శిల్పకళా వేదిక మారుమోగింది. లోహిత్ రెడ్డి, చిత్రలేఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

ఈ సందర్భంగా పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఆటా రజతోత్సవ సభలలో అవకాశం కల్పిస్తారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, భాషా వ్యాప్తిని ప్రవాస తెలుగువారు కాపాడుకుంటూ వస్తున్నారని, కళా, సాహిత్యం, సేవారంగాలలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

అట్టహాసంగా ఆటా వేడుకలు

అట్టహాసంగా ఆటా వేడుకలు

కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమవంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమని ఆయన అన్నారు.

English summary
The four day event organised by American Telugu Association (ATA) concluded on a grand note at Shilpa Kala Vedika in Hyderabad on Sunday. The ATA organised several programmes including folk songs, classical music and dances showcasing Telangana culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X