ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు దెబ్బలు.. ఇప్పుడు కేసులు.. అటవీ అధికారులపై దాడి కేసులో ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

కాగజ్ నగర్ : మహిళా ఎఫ్‌ఆర్‌వో అనితతో పాటు అటవీ సిబ్బందిపై స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు దాడి చేయడం వివాదస్పదమైంది. విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మేరకు కొందరిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా మహిళా అధికారి అనితతో పాటు మరో 15 మంది అటవీశాఖ సిబ్బందిపై కేసులు నమోదు కావడం గమనార్హం.

ఆ గొడవ జరిగాక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానికులకు బ్రీఫింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. తాను ఎలా చెబుతున్నానో అలాగే విలేకరులకు చెప్పాలంటూ ఆయన మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. తమ్ముడిని ఆ కేసు నుంచి బయటపడేసేందుకు స్వయంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగడం హాట్ టాపికయింది.

ఛలో యానాం.. ఆట, మందు రెండూ.. క్యూ కడుతున్న పేకాటరాయుళ్లుఛలో యానాం.. ఆట, మందు రెండూ.. క్యూ కడుతున్న పేకాటరాయుళ్లు

కర్రలతో చితకబాదారు.. ఉల్టా కేసులు

కర్రలతో చితకబాదారు.. ఉల్టా కేసులు

సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియాలోని సార్సాలా అటవీ ప్రాంతంలో పది రోజుల కిందట జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళా అటవీ అధికారితో పాటు ఇతర సిబ్బందిపై కర్రలతో దాడి చేసిన వైనం చర్చానీయాంశమైంది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ సూత్రధారిగా జరిగిన ఆ దాడి అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. దాంతో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరు కృష్ణ తదితరులపై కేసులు కూడా నమోదయ్యాయి.

పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడ్డారనే వార్త దుమారం రేపింది. ఆ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు తనకు కోనేరు కృష్ణ నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంతో మళ్లీ వార్తల్లోకెక్కింది. సదరు మహిళా అధికారి అనితతో పాటు మరో 15 మంది అటవీ అధికారులు, సిబ్బందిపై
ఎస్సీ, ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేయడం గమనార్హం.

 డ్యూటీ చేస్తుంటే కొట్టారు.. ఇప్పుడేమో అట్రాసిటీ కేసు

డ్యూటీ చేస్తుంటే కొట్టారు.. ఇప్పుడేమో అట్రాసిటీ కేసు

మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితతో పాటు సదరు సిబ్బంది తనను కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేశారని ఆరోపిస్తూ.. సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ ఈస్గామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుట చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు డీఎస్పీ.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అటవీ భూములు మునిగిపోయాయి. అయితే వాటి స్థానంలో ఇతర ప్రాంతంలో మొక్కలు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఆ మేరకు కాగజ్‌నగర్ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్ల భూమిని ఎంపిక చేశారు. ఆ క్రమంలో ఆ భూమిని చదును చేయడానికి పది రోజుల కిందట అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ట్రాక్టర్లను సైతం తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లడంతో కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిరగబడ్డారు.

ఎమ్మెల్యేపై ఆరోపణలు.. తమ్ముడిని సేఫ్ జోన్‌లో పడేసేలా..!

ఎమ్మెల్యేపై ఆరోపణలు.. తమ్ముడిని సేఫ్ జోన్‌లో పడేసేలా..!

ప్రభుత్వ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో భాగంగా అటవీ సిబ్బంది మొక్కలు నాటే ప్రయత్నం చేస్తే తీవ్రంగా కొట్టడమే గాకుండా ఉల్టా కేసులు బనాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గ్రామస్తులకు బ్రీఫింగ్ చేసిన వీడియో బయటకు రావడంతో కేసును రివర్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. తమ్ముడిని సేఫ్ జోన్‌లో పడేసేందుకు అటవీ అధికారులపై కుట్ర పన్నారనే టాక్ కూడా నడుస్తోంది.

ఆ క్రమంలో ఎఫ్‌ఆర్‌వో అనితతో పాటు మరో 15 మంది అటవీ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రపూరితంగా గ్రామస్తులతో కేసు పెట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తన పలుకుబడి ఉపయోగించి ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి.

English summary
SC, ST Atracity case filed against Woman Forest Officer who was beaten by sirpur kagaznagar mla brother. Another 15 more officials also booked under this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X