వార్నర్..తగ్గేదే లే: పుష్పరాజ్ పాటలకు డాన్స్ తో మరోసారి : శ్రీవల్లి పాటకు స్టెప్పులతో..వైరల్..!!
డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఆటలో.. టీం నాయకత్వంలో మేనేజ్ మెంట్ లక్ష్యాలను అందుకోవటంతో విఫలం కావటంతో పక్కన పెట్టేసారు. చివరకు టీం మెంబర్స్ కు సహాయకుడిగానూ వ్యవహరిస్తూ..గ్రౌండ్ లో డ్రింక్స్ అందిచారు. కానీ, రానున్న ఐపీఎల్ కు వార్నర్ రాయల్ ఛాలెంజర్స్ నుంచి ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇక, వార్నర్ తెలుగు సినిమాలు..అందునా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మంచి ఫాలోయర్.
బన్నీ పాటలకు స్టెప్పులు వేయాల్సిందే
కరోనా ప్రారంభ వేళ..రికార్డులు క్రియేట్ చేసిన అలా..వైకుంఠపురం సినిమాలోనూ సాంగ్ లకు వార్నర్ రీల్స్ తో హోరెత్తించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత క్రికెట్ గ్రౌండ్ లోనూ ఆ స్టెప్పులు వేసారు. స్వయంగా అల్లు అర్జున్ సైతం ఆ పాటకు అంత క్రేజ్ రావటం వెనుక వార్నర్ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలుగు సినిమాలకు చెందిన చాలా డైలాగ్‌లు, పాటలను రీల్స్ రూపంలో చేస్తూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించారు.

నాడు బుట్టబొమ్మ సాంగ్.. నేడు శ్రీవల్లి పాటకు
ఇక, ఇప్పుడు పుష్ప మూవీ లోని పాటల విషయంలో వార్నర్ తగ్గేదే లే అంటున్నారు. ఈ మూవీ ఇప్పటికే నేషనల్ వైడ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ ముందు సంచలన విజయం సాధించింది. ఇందులోని పాటలు కూడా అదే స్థాయిలో విజయవంతమయ్యాయి. ఇక, ఈ మూవీలోని పాటలకు తెలుగు ప్రేక్షకులే కాదు.. భారత్ ను దాటేసి ఆస్ట్రేలియాలో ఉన్న వార్నర్ సైతం స్టెప్పు వేయకుండా ఆగలేకపోయారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు కాలు కదిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పుష్ప రాజ్ మేనరిజాన్ని అచ్చుగుద్దినట్లు దింపేసి నెటిజన్లను షాక్‌కి గురి చేశాడు.

వార్నర్ స్టెప్పులతో వీడియో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు పుష్ప హాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేస్తూ.. తర్వాత ఏంటి అంటూ వార్నర్ ప్రశ్నిస్తూ క్యాప్షన్ గా రాసుకొచ్చారు. ఇదే సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాటకు డ్యాన్స్ చేసారు. పుష్ఫ మూవీకి సంబంధించి తాజాగా జబర్దస్త్ లో ఆది సైతం స్కిట్ చేసారు. ఇప్పుడు వార్నర్ షేర్ చేసిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.