వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేశాడు

తన స్నేహితుడి ఇంట్లోనే సద్దాం అనే వ్యక్తి దొంగతనం చేశాడు. అప్పులను తీర్చేందుకు ఆయన స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేశాడు. దీపు యదవ్, సద్దాం స్నేహితులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :నమ్మిన స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేశాడు ఓ వ్యక్తి,. అప్పులు తీర్చుకొనేందుకు స్నేహితుడుడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ నగలను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

అప్పుల భాద తట్టుకోలేక సద్దాం అనే వ్యక్తి నువ్వులబండలో నివసిస్తున్న స్నేహితుడు దీపు యాదవ్ ఇంట్లో దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో దొంగతనం చేసి దోచుకొన్న సొమ్మును విక్రయించేందుకు వెళ్ళి పట్టుబడ్డాడు.

దీపు యాదవ్, సద్దాం ఇద్దరు మంచి స్నేహితులు.. వీరిద్దరూ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 21వ, తేదిన రాత్రి స్నేహితుడి ఇంటి తాళం వేసి బీరువాలో ని నగలను , నగలను చోరిచేశాడు సద్దాం.

ఈ నెల 19వ, తేదినే దీపు యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్ళాడు. తాను తిరుపతికి వెళ్తున్నట్టు దీపు యాదవ్ సద్దాం కు చెప్పాడు. ఈ సమాచారం ముందే తెలుసుకొన్న సద్దాం 21వ, తేది రాత్రి పూట స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు.

తిరుపతి నుండి ఇంటికి వచ్చిన దీపుయాదవ్ ఇంటితాళాలు పగులగొట్టి ఉండడం, బీరువాలో భద్రపరిచిన నగలు, నగదు లేకపోవడంతో చీరి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సద్దాం గురువారం ఉదయం ఎల్ బి నగర్ లో వెంకటేశ్వర్ జ్యూయలరీ దుకాణంలో చోరీ చేసిన నగలను అమ్మేందుకు వెళ్ళాడు.

అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తి సద్దాం ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.అతని నుండి బంగారం , నగదును స్వాధీనం చేసుకొన్నారు.

English summary
auto driver saddam theft ornaments and currency from his friends house . deepyadav and saddam close friends. when deepyadav went to tirupupati, saddam theft ornaments,currency from deepyadav house. police arrested saddam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X