వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోమెబైల్‌ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు హుష్‌కాక్ .. తగ్గిన విమాన ప్రయాణాలు, కింద కిందకి రూపాయి విలువ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపుల కంటే పద్దు తగ్గించడమే దీనికి సజీవ సాక్ష్యం. బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా మాంద్యం గురించి ప్రస్తావించారు. మాంద్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కోల్పోయానని పేర్కొన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి క్రమంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ త్రైమాసికంలో 5 శాతానికి కనిష్టంగా చేరడం తిరోగమనానికి అద్దం పడుతుందన్నారు.

18 నెలలుగా ...

18 నెలలుగా ...

దేశంలో గత 18 నెలల నుంచి మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంది. అన్నిరంగాలపై రెసిషన్ ఎఫెక్ట్ చూపింది. 2018 తొలి త్రైమాసికంలో జీడీపీ 8 శాతం ఉందని .. అదీ క్రమంగా తగ్గుతుందని గుర్తుచేశారు. రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి చేరిందని గుర్తుచేశారు సీఎం కేసీఆర్. చివరి త్రైమాసికం 5.8 శాతానికి తగ్గిందన్నారు. దీనికితోడు వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందని వివరించారు. ఇది స్వయంగా సియామ్ వెల్లడించిందన్నారు.

తగ్గిన 33 శాతం ఉత్పత్తి

తగ్గిన 33 శాతం ఉత్పత్తి

మాంద్యంతో వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందని వివరించారు సీఎం కేసీఆర్. వాహన విక్రయాలు 10.6 శాతం దిగజారాయని గుర్తుచేశారు. దీంతో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆటోమొబైల్ రంగంపై మాంద్యం దెబ్బ పడిందని ... దీంతో 3 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయన్నారు. ఆయా కంపెనీ వస్తువులపై వేసే పన్నులు తగ్గుతాయన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకం కూడా క్రమంగా తగ్గుందన్నారు. ఆయా వాహనాలకు సంబంధించి పన్ను కట్టే ప్రసక్తే ఉండదని .. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు గండిపడుతుందని తెలిపారు.

విమాన ప్రయాణాలు కూడా నో

విమాన ప్రయాణాలు కూడా నో

ఆటోమొబైల్ రంగంలోనే కాదు .. మాంద్యంతో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. 11.6 శాతం తగ్గి .. 0.3 శాతానికి తగ్గిందన్నారు. మరోవైపు కార్గొ విమానాల్లో సరుకు రవాణా కూడా 10.6 శాతానికి చేరిందని వివరించారు. దీనికి కారణం అన్నిరకాల వస్తువుల డిమాండ్ తగ్గడమేనని ప్రస్తావించారు. గూడ్స్ రైళ్లలో కూడా సరుకు రవాణా 1.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని .. మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో గన్నుల్లో బొగ్గు ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గుతుందన్నారు. బొగ్గు ఉత్పత్తి ఒక శాతానికి చేరిందని. మొత్తానికి ఆటోమొబైల్ రంగంపై ఆర్థిక మాంద్యం భారీగానే ప్రభావం చూపింది. దీంతో 3 లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడమే నిదర్శనం.

కింద కిందకి రూపాయి విలువ

కింద కిందకి రూపాయి విలువ

ఆర్థిక మాంద్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు రూపాయితో అమెరికా డాలర్ మారకపు విలువ భారీగా గడిపోయింది. ఎన్నడూ లేని విధంగా రూ.70కి పైగా చేరిపోయింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని సభకు వివరించారు సీఎం కేసీఆర్. ఆయా శాఖలు ఉన్న బకాయి వెంటనే చెల్లించాలని డిసైడయినట్టు పేర్కొన్నారు.

English summary
The economic downturn has had a major impact on the full budget of Telangana. The live testimony to this is that the vote on account budget is less than allocations. In the budget speech, CM KCR mainly addressed the recession. Central and state governments have lost their revenues in the recession. There is concern that the country's gross domestic product is gradually declining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X