వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం .. కొత్త భాష కనుగొన్న మాస్టారు .. కళ్ళతో మాట్లాడేస్తున్న అమ్మాయిలు.. ఎక్కడో కాదు మన తెలంగాణా

|
Google Oneindia TeluguNews

ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇంకొకరికి చెప్పాలంటే మాటల ద్వారా చెప్తారు.. లేదా పేపర్ మీద రాసి చూపిస్తారు. ఇక కొందరైతే సైగల ద్వారా కూడా చెబుతారు. అంతేనా కళ్ల ద్వారా కూడా చెప్పొచ్చు అంటున్నారు ఓ మాస్టారు. తెలుగు భాష లోని వర్ణమాలలోని అక్షరాలను, గుణింతాలను, అన్నింటిని కళ్లకు నేర్పించి ఆ కళ్ల భాషతో చెప్పదలుచుకున్న విషయాన్ని ఇట్టే చెప్పొచ్చు అంటున్నారు. ఇక మాస్టారు కనిపెట్టిన ఈ భాషను ఇద్దరు సూపర్ స్టూడెంట్స్ ఇట్టే పట్టేశారు. కళ్లతోనే తెగ మాట్లాడేసుకుంటున్నారు.

దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఉంటే బాప్ బేటాలకు జాయింట్ గా ఇవ్వాలి.. లోకేష్ , బాబులపై విజయసాయి ఫైర్దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఉంటే బాప్ బేటాలకు జాయింట్ గా ఇవ్వాలి.. లోకేష్ , బాబులపై విజయసాయి ఫైర్

Recommended Video

స్పీడ్ గా వెళ్ళొద్దన్నాడని వ్యక్తి పై దాడి చేసిన పోకిరీలు...
కళ్ళతో మాట్లాడుతున్న విద్యార్థినులు .. కను సైగలతోనే కళ్ళ భాష

కళ్ళతో మాట్లాడుతున్న విద్యార్థినులు .. కను సైగలతోనే కళ్ళ భాష

పాత పాలమూరు జిల్లా ప్రస్తుత నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కన్నుల భాషలు తెలియునులే అంటున్నారు .

పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రమాదేవి , సంతోష లు మాస్టారు కనిపెట్టిన కన్నుల భాషను నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కళ్లను పైకి కిందికి కదిలిస్తూ, కనుగుడ్లను కుడి ఎడమ వైపులకు తిప్పుతూ, కళ్ల రెప్పలను కొడుతూ ఎలాంటి విషయాన్ని అయినా సరే అవతలి వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు. రమాదేవి కళ్లతో చెప్పిన విషయాన్ని సంతోష చక్కగా రాస్తుంది. ఇక సంతోష చెప్పిన విషయాన్ని రమాదేవి అంతే వేగంగా చెప్పగలుగుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం కళ్ళతోనే వ్యక్తం చేస్తున్న ఈ భాషను అంతే చక్కగా కళ్ల ద్వారా తెలియజేస్తున్నారు ఈ విద్యార్థినులు.

తెలుగు భాషలోని వర్ణమాలను కళ్ళకు నేర్పించిన మాస్టారు .. కొన్ని సంకేతాలతో కళ్ళ భాష

తెలుగు భాషలోని వర్ణమాలను కళ్ళకు నేర్పించిన మాస్టారు .. కొన్ని సంకేతాలతో కళ్ళ భాష

ఇక ఇది చూసిన వారంతా ప్రాంతాలకు భాష ఉంటుందని తెలుసు, మనసుకి ఒక భాష ఉంటుందని, బాడీకి ఒక లాంగ్వేజ్ ఉంటుందని తెలుసు. కానీ కళ్లతో ఇలా తెలుగు భాషను మొత్తం చెప్పొచ్చు అనేది తెలియదని ఇది నిజంగా అద్భుతమని కొనియాడుతున్నారు.

పోతిరెడ్డి పల్లి పాఠశాలలోని తెలుగు మాస్టరు హనుమంతు ఈ విద్యార్థులకు కళ్ల భాషను నేర్పించారు. ఒక్కొక్క అక్షరానికి కళ్ళతోనే ఒక్కొక్క సైన్ పెట్టుకున్నానని, వాటన్నింటినీ విద్యార్థులకు నేర్పించడంతో పాటు, గుణింతాలు, తలకట్లు ,దీర్ఘాలు, సున్న, అరసున్న లకు సైతం కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నానని అదే విద్యార్థులకు నేర్పించాలని ఆయన చెబుతున్నారు. 10 రోజుల్లోనే భాష నేర్చుకుని, నెల రోజుల్లో పర్ఫెక్ట్ అయ్యారని తన దగ్గర చదువుతున్న విద్యార్థుల గురించి, కళ్ల భాష నేర్చుకున్న సూపర్ స్టూడెంట్స్ గురించి చాలా గర్వంగా చెబుతున్నారు మాస్టారు.

యుద్ధ అత్యవసర సమయాలలో చాలా ఉపకరించే కళ్ళ భాష .. మరింత అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన

యుద్ధ అత్యవసర సమయాలలో చాలా ఉపకరించే కళ్ళ భాష .. మరింత అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన

ఇక ఈ అమ్మాయిలు సైతం ఎన్నో కీలకమైన విషయాలను కనుసైగలతోనే అర్థం చేసుకుంటున్నారు. తెలుగు మహాసభల స్ఫూర్తితో ఈ భాషను అభివృద్ధి చేశామని హనుమంతు మాస్టారు చెబుతున్నారు.

అయితే ఈ కళ్లతో కోడ్ చేసే ఈ లాంగ్వేజ్ యుద్ధ అత్యవసర సమయాలలోనూ, దేశానికి సంబంధించిన అతి రహస్యమైన విషయాలను అవతలి వ్యక్తికి అందించడంలోనూ ఉపయోగపడతాయనే భావన వ్యక్తమవుతోంది. కొన్ని సంకేతాలతో కళ్ల ద్వారా అన్ని విషయాలను ప్రదర్శిస్తున్న విద్యార్థుల ప్రతిభను అందరూ కొనియాడుతున్నారు. ఇక హనుమంతు మాస్టార్ కృషితో నోరే కాదు కళ్ళు మాట్లాడతాయని వాటికి ఓ భాష ఉందని అవి ఎలాంటి విషయాన్నైనా ఇట్టే చెప్పేస్తాయని , ఈ భాషని అభివృద్ధి చేయడం వల్ల దేశానికి ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది .మొత్తానికి మాస్టారు కనిపెట్టిన కొత్త భాషతో కళ్లతో చకచకా మాట్లాడేస్తున్నారు విద్యార్థినులు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కళ్ళతో మాట్లాడడం నేర్చుకోవాలంటే పోతిరెడ్డి పల్లి లోని ప్రభుత్వ పాఠశాల మాస్టారు హనుమంతు సార్ దగ్గరకు వెళ్ళండి .

English summary
government school students from the village of Potireddipalli in Kosgi Mandalam district of the present Narayana Peeta district learned eyes language .ramadevi and santhosha The students are amazed by learning the language of the eyes . Moving the eyes up and down the eyeballs to the right and left eyelashes, they say that they can understand anything. What Ramadevi says with her eyes is santhosha understands and Ramadevi is able to say santhosha's eyes language faster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X