వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict: తీర్పు రానున్న నేపధ్యంలో తాజా పరిణామాలు..కర్ఫ్యూలు ,144 సెక్షన్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ayodhya Verdict : అయోధ్య తీర్పు నేపధ్యం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన కర్ఫ్యూ ! || Oneindia Telugu

అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో దేశం మొత్తం అప్రమత్తమైంది. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాకట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం . సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రత పెంచింది. ఎక్కడా మత విద్వేషాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అడుగడుగునా భద్రత పెంచి శాంతి సౌభ్రాతృత్వాల కోసం ప్రయత్నం చేస్తుంది.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపుAyodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

ఉత్తర ప్రదేశ్-నేపాల్ సరిహద్దు రాకపోకలు నిలిపివేత

అయోధ్య తీర్పు నేడు రానున్న నేపధ్యంలో దేశం అలెర్ట్ అయ్యింది. అయోధ్య నిఘా నీడలో ఉంది. 4 వేల మంది పారామిలటరీ బలగాలు అయోధ్యలో మొహరించాయి. అంతే కాదు డ్రోన్ల సహాయంతో అయోధ్యలో అడుగడుగూ నిఘా పెట్టారు. ఎలాంటి మత విద్వేషాలకు , ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తం అయిన పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తర ప్రదేశ్-నేపాల్ సరిహద్దు రాకపోకలు నిలిపివేశారు. ఎవరినీ సున్నితమైన సరిహద్దు వెంట వెళ్ళడానికి అనుమతించబోమని హోం అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్ అవస్థీ పేర్కొన్నారు.

రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 144 సెక్షన్... హిమాచలప్రదేశ్ అలెర్ట్

అయోధ్య తీర్పు వెలువడనున్న నేపధ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సెక్షన్ 144 ను విధించింది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఇంటర్నెట్ సేవలు కూడా ఆపివేయబడ్డాయి. అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు రాజకీయ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పుకు ముందే నకిలీ వార్తలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేశారు. నకిలీ వార్తలు, మార్ఫింగ్ పిక్చర్స్ సోషల్ మీడియా లో సర్క్యులేట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.

అయోధ్యలో ప్రత్యేక బస్సులు .. హైదరాబాద్ లో అలెర్ట్ ..

అయోధ్యలో ప్రత్యేక బస్సులు .. హైదరాబాద్ లో అలెర్ట్ ..

అయోధ్యలో యాత్రికులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు మరియు నగరంలో ఉన్న యాత్రికులను తిరిగి వారి ఇంటికి తీసుకెళ్లడానికి మరిన్ని బస్సులను అందుబాటులోకి తెచ్చారు.దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా, బాంబు పేలుళ్లు జరిగినా హైదరాబాద్ లో ఆ ఘటనకు సంబంధించిన మూలాలు ఉంటాయని ఇప్పటికే పలు ఘటనలు తేటతెల్లం చేశాయి. ఇక ఈ నేపధ్యంలో చారిత్రాత్మక తీర్పు అయోధ్యపై రానున్న తరుణంలో హైదరాబాద్ లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ భద్రత పెంచారు.

మధ్యాహ్నం ఆర్ఎస్ ఎస్ చీఫ్ ప్రెస్ మీట్ .. శ్రీ శ్రీ రవిశంకర్ సందేశం

మధ్యాహ్నం ఆర్ఎస్ ఎస్ చీఫ్ ప్రెస్ మీట్ .. శ్రీ శ్రీ రవిశంకర్ సందేశం

అంతర్జాతీయ ఆధ్యాత్మిక నాయకుడు మరియు మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కోర్టు తీర్పు నేపధ్యంలో స్పందించారు. "దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న చారిత్రక తీర్పు ఈ రోజు ఎదురుచూస్తోంది. ఇది రెండు వర్గాలను సంతృప్తిపరుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. శాంతి, సామరస్యం మరియు సోదర భావాన్ని కాపాడుకోవాలని నేను అన్ని వర్గాల ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. " అని పేర్కొన్నారు.అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కేశవ్ కుంజ్ పరిసర్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ఆర్ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మీడియా ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ట్విట్టర్‌లో ప్రకటించింది.

English summary
In the wake of the Ayodhya verdict today, Telangana state police have taken action without any clashes . Alarmed in the wake of the Ayodhya verdict, the police focused on sensitive and troubled areas. in all states As per the directions of the office of the DGP, all the Commissionerate and the SP offices of the police are holding meetings with the Peace Committees and Basti Committees in all the police stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X