హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ కరెంట్ షాక్ తగిలి బీటెక్ విద్యార్ధి మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ పక్కనే ఉన్న కరెంట్ తీగలను తాకి బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటున్న రాకేశ్ అనే విద్యార్ధి నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రశాంత్ నగర్‌లో ఉంటున్న తన ప్రెండ్ రూమ్‌కు వచ్చాడు. బిల్డింగ్ రెండో అంతస్తులో నిలబడి ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని స్నేహితులు మెడిసిస్ ఆసుపత్రికి తరలించారు.

B Tech student killed in vanasthalipuram due to electric shock

ఆసుపత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడు. కరెంట్ షాక్‌కు అతడి ఎడమ చేయి కాలిపోయింది. దీంతో రాకేశ్ స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రాకేశ్ మృతిపై స్థానికులు సైతం విచారాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే కాలనీలో ఉన్న పాత 11కేవీ కరెంట్ తీగలను మార్చి కొత్త వాటిని వేశారన్నారు. తీగలను మార్చిన రెండు రోజుల్లోనే ఈ సంఘటన జరగడం దురదుష్టకరమని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేశ్ అజాగ్రత్త వల్లే మృతి చెందాడా లేక ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A tragic incident took place at Vanasthalipuram in Hyderabad. B tech student died while talking to some one with mobile phone. It has been reported that the phone was in charging mode and B Tech student talked without removing the charger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X