వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్కెట్ ఎందుకివ్వలేదో తెలియదు, బీజేపీది మంచి అడ్మినిస్ట్రేషన్: బాబూమోహన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీ తనకు టిక్కెట్ ఎందుకివ్వలేదో తెలియదని మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ అన్నారు. ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ వెలుగు వెలుగుతుందని చెప్పారు. తాను స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రేమతో టీడీపీలో చేరానని చెప్పారు.

<strong>పొగరు: జానా వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, నాకు సమాధానం చెప్పలేదు: కొండా సురేఖ</strong>పొగరు: జానా వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, నాకు సమాధానం చెప్పలేదు: కొండా సురేఖ

ఎన్టీఆర్ మరణం తర్వాత గౌరవం తగ్గిందని తాను పార్టీ మారానని చెప్పారు. రాజకీయ జన్మను ఇచ్చిన టిడిపిని తాను వదలలేదని, నా దేవుడు ఎన్టీఆర్ కోసమే టీడీపీలో చేరానని, అన్నగారు పోయాక గౌరవం తగ్గిందని అన్నారు. తెరాస టిక్కెట్ ఇవ్వనందుకు తాను పార్టీ మారానని చెప్పడం అవాస్తవం అన్నారు. తనను అక్కరలేదన్నారని చెప్పారు.

అమిత్ షా పిలిచారు, బీజేపీకి మంచి అడ్మినిస్ట్రేషన్

అమిత్ షా పిలిచారు, బీజేపీకి మంచి అడ్మినిస్ట్రేషన్

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వద్ద పని చేయాలనుకున్నానని, తనను పిలిచారని, వచ్చానని, పార్టీలో చేరానని బాబూ మోహన్ చెప్పారు. బీజేపీకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్పారు. మంచి నాయకుడు ప్రధానిగా ఉన్నారని తెలిపారు. అమిత్ షా ఆలోచనా విధానం తనకు నచ్చిందని అన్నారు. బ్రహ్మాండంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా కమలం ఓ వెలుగు వెలుగుతుందన్నారు.

నా గురించి మంచిగా విన్నానని అమిత్ షా చెప్పారు

నా గురించి మంచిగా విన్నానని అమిత్ షా చెప్పారు

ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్‌ను విమర్శించాలి కదా అంటే.. బాబు మోహన్ స్పందిస్తూ.. ఒక్కర్ని కాదని, తప్పు చేసిన వారందర్నీ విమర్శిస్తానని చెప్పారు. తన పోటీ విషయమై ఇంకా తెలియదన్నారు. తన గురించి మంచిగా విన్నానని అమిత్ షా చెప్పారని, మంచిగా పని చేయమని తనకు చెప్పారని అన్నారు. బీజేపీ ఏపీలో ప్రచారం చేయమన్నా చేస్తానని, శ్రీలంకలో తిరగమన్నా తిరుగుతానని అన్నారు.

బీజేపీకి పని చేసేందుకు వచ్చా, పదవుల కోసం రాలేదు

బీజేపీకి పని చేసేందుకు వచ్చా, పదవుల కోసం రాలేదు

తాను బీజేపీకి పని చేసేందుకు వచ్చానని, పదవుల కోసమే రాలేదని బాబూ మోహన్ అన్నారు. తాను ఆందోల్ టిక్కెట్ రానందుకే పార్టీ మారానని మీకు ఎక్కడ వినిపించిందో తనకు తెలియదని, మీకు ఎక్కడైనా వినిపిస్తే నాకు చూపించాలని అన్నారు. తాను అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజమే అన్నారు. మందలించడం తనకు అలవాటు అన్నారు. నేను లంచాలు తీసుకోనని, వాళ్లు ఇచ్చే పర్సంటేజీల కోసం పని చేయనని, ప్రజల కోసం పని చేస్తానన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు.

అవకాశం ఇస్తే పోటీ చేస్తా

అవకాశం ఇస్తే పోటీ చేస్తా

తాను లోకసభ నుంచి పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా తెలియదన్నారు. అవకాశం వస్తే పోటీ చేస్తానని చెప్పారు. బీజేపీ కోసం అవసరమైతే శ్రీలంకలో కూడా ప్రచారం చేస్తానని బాబూ మోహన్ అన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని, పని చేయడం కోసమే మారానని చెప్పారు. తాను లంచాలు తీసుకోనని, పర్సెంటేజీల కోసం పని చేయనని చెప్పారు.

English summary
Film actor P. Babu Mohan, who was denied a ticket by the TRS from the Andhole (SC) Constituency in Sangareddy district on Saturday joined the BJP in the presence of party president Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X