కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్! దిమ్మతిరిగిలా.. నేనెంటో చూపిస్తా: బాబు మోహన్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ పై బాబు మోహన్ మండి పాటు

కరీంనగర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పాత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆందోల్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో ఇటీవల బాబు మోహన్.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

<strong>ఆంధ్రా యువకుడి అభిమానానికి ఫిదా! కేటీఆర్ ధన్యవాదాలు, అసలేం చేశారంటే.?</strong>ఆంధ్రా యువకుడి అభిమానానికి ఫిదా! కేటీఆర్ ధన్యవాదాలు, అసలేం చేశారంటే.?

ఇంతటి నియంతను చూడలేదు

ఇంతటి నియంతను చూడలేదు

కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న బాబు మోహన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాంటి నియంత సీఎంను తాను ఇదివరకెప్పుడూ చూడలేదని విమర్శించారు.

<strong>టీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, కండువా కప్పిన అమిత్ షా </strong>టీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, కండువా కప్పిన అమిత్ షా

నేనెంటో చూపిస్తా..

నేనెంటో చూపిస్తా..

ఫాంహౌస్‌లో ముసుగేసుకుని పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆరేనని బాబు మోహన్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో తన వాగ్ధాటి ఏమిటో కేసీఆర్‌కు చూపిస్తానంటూ హెచ్చరించారు.

కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా..

కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా..

తనను చులకనగా చూసిన కేసీఆర్‌కు తన ప్రతాపమెంటో చూపించి దిమ్మతిరిగేలా సమాధానం చెబుతానని బాబు మోహన్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌పై తాను విమర్శలు చేయడం ఇది ఆరంభం మాత్రమేనని, అక్టోబర్ 10 నుంచి కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచుతానని బాబు మోహన్ అన్నారు.

ఆందోల్ టికెట్ నిరాకరించడంతో..

ఆందోల్ టికెట్ నిరాకరించడంతో..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ తొలి జాబితాలో ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాబు మోహన్‌ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తాను నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేశానని అయినా తనకు టికెట్ నిరాకరించడం ఏంటని బాబు మోహన్ ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకపోవడం అవమానంగా భావించిన బాబు మోహన్ చివరకు ఆ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

English summary
BJP leader and Former MLa Babu Mohan on Monday takes on at TRS preisdent K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X