రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోటార్ ను లాగడం వల్లే, 60 గంటల్లో ఎప్పుడేమైంది?

60 గంటలపాటు శ్రమించినా కానీ బోరుబావిలో పడినఏడాదిన్నర చిన్నారి వీణ ప్రాణాలను కాపాడలేకపోయారు అధికారులు. అయితే బోరుబావిలో సుమారు 12 గంటలపాటు చిన్నారి సజీవంగా ఉందని అధికారులు ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: 60 గంటలపాటు శ్రమించినా కానీ బోరుబావిలో పడినఏడాదిన్నర చిన్నారి వీణ ప్రాణాలను కాపాడలేకపోయారు అధికారులు. అయితే బోరుబావిలో సుమారు 12 గంటలపాటు చిన్నారి సజీవంగా ఉందని అధికారులు ప్రకటించారు. 60 గంటల తర్వాత వీణ శరీర బాగాలను ముద్దలు ముద్దలుగా మాత్రమే వెలికితీయగలిగారు.

గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆడుకొంటూ ప్రమాదవశాత్తు వీణ బోరుబావిలో పడిపోయింది. బోరుబావిలో పడిపోయిన వీణను కాపాడేందుకు అధికారులు తీవ్రంగానే శ్రమించారు. అయితే అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.

అయితే బోరుబావిలో పడిన వీణను వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం , కరుణాకర్ టీమ్, ఓఎన్ జి సీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. క్షణం కూడ పనినిలిపివేకుండానే అధికారులు మూడు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. అయినా ఫలితం దక్కలేదు.

బోరుబావిలో పడిన చిన్నారికి ధైర్యం చెప్పేందుకు తల్లితో కూడ మాట్లాడించారు అధికారులు. తల్లి మాటలకు ఆ చిన్నారి ప్రతిస్పందించింది.అయితే గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన చిన్నారి వీణ శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలవరకు ప్రాణాలతో ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

సహయక చర్యలు ప్రారంభించారిలా

సహయక చర్యలు ప్రారంభించారిలా

వీణ బోరుబావిలో పడిన విషయం తెలియగాను అధికారులు సంఘటనస్థలానికి చేరుకొన్నారు. గురువారం రాత్రి ఏడున్నరగంటలకు పోలీసులు , రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సంఘటనస్థలానికి చేరుకొన్నారు.రాత్రి ఏడుగంటల నలభై ఐదు నిమిషాలకు జేసీబీలు చేరుకొన్నాయి. రాత్రి పదకొండు గంటలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారు. అంతేకాదు రాత్రిపూట కలెక్టర్ రఘునందన్ రావు చేరుకొన్నారు.

అత్యాధునిక పరికరాలతో

అత్యాధునిక పరికరాలతో

అత్యాధునిక పరికరాలతో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. గురువారం రాత్రి 12 గంటల తర్వాత సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. జూన్ 22 నుండి జూన్ 23 వ, తేది వరకు బోరు బావికి సమాంతరంగా తవ్వకాలను చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బోరు బావి నుండి మోటార్ ను వెలికితీశారు. అయితే అదే సమయంలో చిన్నారి వీణ 40 అడుగుల లోతు నుండి ఇంకా కిందకు పడిపోయింది.

ప్రత్యేక కెమెరాలను తెప్పించారు

ప్రత్యేక కెమెరాలను తెప్పించారు

ప్రత్యేక కెమెరాలను తెప్పించారు. జూన్ 24వ, తేది ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలను తెప్పించారు. 110 అడుగుల లోతు వరకు కెమెరాను పంపి అన్వేషించినా పాప ఆనవాళ్ళు కన్పించలేదు. మధ్యాహ్నం మ్యాట్రిక్స్ వాటర్ ప్రూప్ కెమెరాను తెప్పించి 210 అడుగుల లోతువరకు అన్వేషించిన కూడ ఫలితం లేకుండాపోయింది. అయితే సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

వందమంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది

వందమంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది

రంగారెడ్డి జిల్లాలో వీణను కాపాడేందుకుగాను వందమంది నిరంతరంగా పనిచేసినా ఫలితం లేకుండాపోయింది. గురువారం రాత్రి నుండి పాపను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.శనివారం రాత్రిపూట పాప చనిపోయి ఉంటుందనే నిర్ధారణకు అధికారులు వచ్చారు. చివరి ప్రయత్నంగా ఫ్లస్ ఔట్ ప్రక్రియను చేపట్టడం ద్వారా పాప ఆవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.

English summary
19 month old girl Veena, affectionately called Chinnari, who slipped into an abandoned bore well three days ago while playing at Chanvelli village in Chevella Mandalam of Rangareddy district, died. The official announcement was made by Minister Mahender Reddy early Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X