వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐలయ్యపై అది పచ్చి అబద్దం: కేటీఆర్ హరీష్‌లకు 'బహుజన ప్రతిఘటన'

ప్రొఫెసర్ ఐలయ్య విషయంలో ప్రధాన స్రవంతి మీడియా వ్యవహరిస్తున్న తీరుపై బహుళ బహుజన సమితి నాయకులు ఉసా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓవైపు ఆర్యవైశ్యులు.. మరోవైపు బహుజనులు.. ఐలయ్య పుస్తకంపై ఇరు వర్గాలది భిన్న వాదన. తమను కించపరిచారని ఆర్య వైశ్యులంతా రోడ్డెక్కుతుంటే.. బహుజనులు సైతం ఐలయ్యను కాపాడుకుందామంటూ ప్రతిఘటిస్తున్నారు.

ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..

ఈ నేపథ్యంలోనే మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'బహుజన ప్రతిఘటన సభ' పేరుతో ఐలయ్యకు మద్దతుగా నిలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేదావులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతిఘటన సభా వేదిక నుంచి పలు తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచారు.

అది పచ్చి అబద్దం: ఉసా

అది పచ్చి అబద్దం: ఉసా

ప్రొఫెసర్ ఐలయ్య విషయంలో ప్రధాన స్రవంతి మీడియా వ్యవహరిస్తున్న తీరుపై బహుళ బహుజన సమితి నాయకులు ఉసా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైశ్యులు ఎక్కడ దాడి చేస్తారేమోనన్న భయంతో ఐలయ్య బెంగుళూరులో దాక్కున్నాడని ఓ పత్రిక రాసిందని, అది పచ్చి అబద్దం అని అన్నారు. ఆ పత్రికకు ఏమాత్రం విలువలున్నా.. 24గం.ల్లోగా ఐలయ్య ఇంటికి వెళ్లి నిజాన్ని నిర్దారించుకోవాలన్నారు. ఈ తప్పిదానికి ఆ పత్రిక ఎడిటర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కులమే వర్గం: అసుర

కులమే వర్గం: అసుర

భారతదేశంలో కులమే వర్గం అని.. వర్గం పేరుతో ఇంకెన్నేళ్లు కోడ్ లాంగ్వేజ్ వాడుతారని ప్రముఖ సాహితీ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు మండిపడ్డారు. దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకునే కమ్యూనిస్టు ఉద్యమాలు.. కులాన్ని దాచిపెట్టి ఏం పోరాటాలు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అని ఐలయ్య చెప్పేదాకా మనమేం చేస్తున్నట్లు?.. ఈ పని ఇప్పటికైనా జరిగింది' అంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఐలయ్య పోరాటం మామూలుది కాదు: బాలబోయిన

ఐలయ్య పోరాటం మామూలుది కాదు: బాలబోయిన

ఏళ్లుగా ప్రొఫెసర్ ఐలయ్య సాగిస్తున్న పోరాటం మామూలుది కాదని ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా దళిత బహుజనులంతా గోచి గొంగడి ధరించి.. అర్థనగ్నతతో రోడ్ల మీద పాటలు పాడుతున్నారని, కానీ ఏ ఒక్క అగ్రవర్ణ వ్యక్తి కూడా అర్దనగ్నంగా పాటలు పాడిన సందర్భం లేదని అన్నారు. ఈ చరిత్రను ఐలయ్య మార్చగలిగారని, దాని ఫలితంగానే ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్ 'నలిగంటి శరత్' కోటు ధరించి పాటలు పాడే హుందా సంస్కృతికి తెరలేపారని గుర్తుచేశారు.

బహుజన ప్రతిఘటన తీర్మానాలు:

బహుజన ప్రతిఘటన తీర్మానాలు:

1. గౌరీ లంకేష్ హంతకులను వెంటనే అరెస్టు చేయాలి. హంతకుల వెనక వున్న వ్యక్తులను, సంస్థలను ప్రకటించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

2. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, దళితులు, గరిజనులు, ముస్లిం, క్రైస్తవుల మీద హిందూత్వ శక్తులు చేస్తన్న దాడులను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మోడీ ప్రభుత్వం అధికారంలో వుండటం వల్లే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి 2019 ఎన్నికల్లో బిజెపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం.
3. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజుకు సభ సంఘీభావం ప్రకటించింది
4. కంచ ఐలయ్యను మానసిక హింసకు గురిచేస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులను, పరిపూర్ణానందను వెంటనే అరెస్టు చేయాలి. ఆయన మీద దాడికి ప్రయత్నించిన వాళ్లను కఠినంగా శిక్షించాలి.
5. రాజకీయ ఎదుగుదల కోసమే ఆర్య వైశ్య నాయకులు అయిలయ్య రచనలను వివాదస్పదం చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ వైశ్య నేతలు పోటీ చేసినా ఓడించాలని ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలను సభ కోరింది.

కేటీఆర్, హరీష్ రావులను ఓడించమని పిలుపు:

కేటీఆర్, హరీష్ రావులను ఓడించమని పిలుపు:

6. ఐలయ్య మీద దాడిని సమర్ధించిన మంత్రులు కేటిఆర్, హరీష్ రావులను 2019 ఎన్నికల్లో బిసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రైస్తవులు ఓడించాలని సభ పిలుపునిచ్చింది.

7.నిజాంబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాను రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని ప్రజలను సభ పిలుపునిచ్చింది.
8. ఈ దేశ బహుజనులను, స్త్రీలను అవమానిస్తున్న బ్రాహ్మణీయ సాహిత్యాన్ని నిషేధించాలని సభ డిమాండ్ చేసింది.
9. లింగాయత్ ధర్మాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని జరుగుతున్న పోరాటానికి సభ మద్ధతు పలికింది.

లింగాయత్ మతంతో పాటు రవిదాసీయ మతం, కబీరు మతం, చొక్కమేల మతం, సిక్కుమతం, శైవమతం, వైష్టవ మతం, పోతులూరి వీరబ్రహ్మం మతంలను కూడా స్వతంత్ర మతాలుగా గుర్తించాలని, వాటిని హిందూమతంలో భాగంగా గుర్తించ రాదని డిమాండ్ చేసింది.

10. లింగాయత్ మతస్తులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మత హక్కుల కోసం ఉద్యమించాలని సభ పిలుపునిచ్చింది.

11. బహుజన మేధావుల మీద జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చింది.
12. అయిలయ్యకు మద్ధతుగా వున్న బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం, ఇతర పార్టీలకు రానున్న ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని సభ ప్రజలను కోరింది.
13. రోహింగ్యా ముస్లింల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ వైఖరిని సభ ఖండించింది. రోహింగ్యాలకు రక్షణ కల్పించి, వాళ్లకు మన దేశంలో బతికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.

పసునూరి, సుజాత అధ్యక్షతన:

పసునూరి, సుజాత అధ్యక్షతన:

బహుజన రచయిత పసునూరి రవీందర్, శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సుజాత సూరేపల్లి అధ్యక్షతన ఈ ప్రతిఘటన సభను నిర్వహించారు. మరో బహుజన రచయిత జిలుకర శ్రీనివాస్ సభ నిర్వహణను పర్యవేక్షించారు.

కార్యక్రమంలో మరోసారి 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం.
విమర్శకులు లక్ష్మీ నర్సయ్య, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, గుడిపెల్లి రవికుమార్, మహేష్ కత్తి, కవి అన్వర్,నలిగంటి శరత్, కవి యాకూబ్, ప్రొఫెసర్ వై.బి సత్యనారాయణ, ఎంవి క్రిష్ణారెడ్డి, జూపాక సుభద్ర, కృపాకర్ మాదిగ, చింతం ప్రవీణ్, కాలువ మల్లయ్య, విమలక్క, జయధీర్‌ తిరుమలరావు, సీనియర్ పాత్రికేయురాలు సజయ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Bahujan writers, Activists hold a meet to support Kanch Ilaiah's book Social 'Smugglers'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X