హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిబ్రవరి 14పై బజరంగ్ దళ్ హెచ్చరిక, ఎంజిబిఎస్‌లో ప్రీపేయిడ్ ఆటోలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటే అడ్డుకుంటామని బజరంగ్ దళ్ మంగళవారం నాడు హెచ్చరించింది. ప్రేమికుల దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేసింది. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకమని చెప్పారు.

ప్రతి యేడా ప్రేమికుల దినోత్సవం నాడు కనిపించే ప్రేమికులకు బజరంగ్ దళ్ వంటి సంస్థలు కౌన్సెలింగ్ ఇస్తుంటాయి. కాగా, ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవానికి కౌంటర్‌గా కొందరు అదే రోజున మాతృ - పితృ దినోత్సవంగా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Bajrang Dal to counsel Lovers day youth

హైదరాబాదు బస్టాండ్లో ప్రీపేయిడ్ ఆటోలు

హైదరాబాదులోని ప్రధాన ప్రయాణ ప్రాంగణాలైన ఎంజిబిఎస్‌, జెబిఎస్‌ల నుంచి త్వరలో ప్రీపేయిడ్‌ ఆటో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విధానాన్ని ఇప్పటికే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అమలు చేస్తోంది. తెలిసిందే. ప్రయాణిలకు నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఈ విధానాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించారు.

ఎంజిబిఎస్, జెబిఎస్ నుంచి ప్రీపేయిడ్ ఆటో సౌకర్యం కల్పించనున్నారు. మొదటి 3 కి.మీ. వరకు ఆటో చార్జీ రూ.40, రాత్రి వేళల్లో అయితే రూ.60గా నిర్ణయించనున్నారు. 3 నుంచి 5 కి.మీ. వరకు ఆటో చార్జీలు రూ.62, రాత్రి వేళల్లో అయితే రూ.93గా తీసుకోనున్నారు.

5 కి.మీ. నుంచి 7 కిలో మీటర్ల వరకు ఆటో చార్జీలు రూ.84, రాత్రి వేళల్లో అయితే రూ.126గా వసూలు చేయనున్నారు. 7 కి.మీ. నుంచి 9 కి.మీ. వరకు ఆటో చార్జీలు రూ.106, రాత్రి వేళల్లో రూ.153 తీసుకోనున్నారు.

9 కి.మీ. నుంచి 11 కి.మీ. వరకు రూ.128, రాత్రి వేళల్లో అయితే రూ.192 వసూలు చేయనున్నారు. 11 కి.మీ. నుంచి 13 కి.మీ. వరకు ఆటో చార్జీలు రూ.150, రాత్రి పూట అయితే రూ.225 తీసుకోనున్నారు.

13 కి.మీ. నుంచి 15 కి.మీ. వరకు ఆటో చార్జీ రూ.172, రాత్రి పూట అయితే 258 వసూలు చేస్తారు. 15 నుంచి 17 కి.మీ. అయితే రూ.194గా, రాత్రి వేళ అయితే రూ.291 తీసుకోనున్నారు. 17 కి.మీ. నుంచి 20 కి.మీ. వరకు రూ.227, రాత్రి సమయంలోనైతే రూ.331 చార్జీగా తీసుకోనున్నారు.

English summary
Bajrang Dal to counsel Lovers day youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X