హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవగాహనే ముఖ్యం: బాలకృష్ణ, కవిత, మంచు లక్ష్మి ఇలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బ్రెస్ట్ క్యాన్సర్(రొమ్ము క్యాన్సర్‌)పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి-పరిశోధన సంస్థతో తెలంగాణ జాగృతి కలిసి పని చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

బుధవారం బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన నడకను నిర్వహించారు. దీన్ని కవితతోపాటు ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ, సినీనటి మంచులక్ష్మిలు ప్రారంభించారు.

ఈ అవగాహన నడక బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనం నుంచి క్యాన్సర్‌ ఆసుపత్రి వరకు కొనసాగింది. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి సేవా కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొనడం అభినందనీయం.

క్యాన్సర్ అవర్నెస్ వాక్

క్యాన్సర్ అవర్నెస్ వాక్

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ విషయంలో క్యాన్సర్‌ ఆసుపత్రితో కలిసి పనిచేయడానికి జాగృతి సిద్ధంగా ఉందన్నారు. నాణ్యమైన క్యాన్సర్‌ వైద్య చికిత్సను తక్కువ ధరలో అందించడానికి బసవతారకం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.

ఉత్సాహంగా సాగిన వాక్

ఉత్సాహంగా సాగిన వాక్

రొమ్ము క్యాన్సర్‌పై మహిళలు ఎలాంటి సంకోచం, బిడియం లేకుండా పరీక్షించుకోవాలన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రారంభించిన ఈ ఆసుపత్రిని 40 పడకల నుంచి 500ల పడుకల స్థాయికి తీసుకెళ్లామన్నారు.

ముందుండి నడిచిన బాలకృష్ణ

ముందుండి నడిచిన బాలకృష్ణ

ఈ కార్యక్రమంలో టెన్నిస్‌ క్రీడాకారిణి బిలేషా, నటులు చలపతిరావు, ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.ఎస్‌.రావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కవిత ప్రసంగం

కవిత ప్రసంగం

అందరి కోసం పనిచేసే మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా ఎందరో అమ్మలు, అక్కలను పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

బెలూన్లూ ఎగరవేస్తూ..

బెలూన్లూ ఎగరవేస్తూ..

బాలకృష్ణ లాంటి సెలెబ్రిటీలు ఈ అంశం గురించి చెబితేనే అందరికీ చేరుతుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమ పాత్ర పోషించాలని కవిత కోరారు. బ్రెస్ట్ కేన్సర్‌ను నివారణతోనే అధిగమించవచ్చని తెలిసినా, చాలామందికి ఆ విషయం తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

జెండా ఊపి ప్రారంభం

జెండా ఊపి ప్రారంభం

బాలకృష్ణ లాంటి సెలెబ్రిటీలు ఈ అంశం గురించి చెబితేనే అందరికీ చేరుతుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమ పాత్ర పోషించాలని కవిత కోరారు. బ్రెస్ట్ కేన్సర్‌ను నివారణతోనే అధిగమించవచ్చని తెలిసినా, చాలామందికి ఆ విషయం తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారులతో బాలకృష్ణ

చిన్నారులతో బాలకృష్ణ

బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ చేపట్టిన ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఓ సారైనా బ్రెస్ట్ కేన్సర్ పరీక్ష చేయించుకోవాలని కవిత కోరారు. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఇది చాలా ముఖ్యమని నటి మంచు లక్ష్మి అన్నారు. వ్యాధి గురించి చర్చించుకునేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని అన్నారు.

English summary
Tollywood popular hero and Hindupuram MLA Nandamuri Bala Krishna attended Breast Cancer awareness programme in Hyderabad along with Nizamabad MLA Kalvakuntla Kavitha and Mohan babu daughter Manchu Lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X