హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిక్టేటర్ చూడండి: కెసిఆర్‌తో బాలకృష్ణ, 100సినిమా గురించి కెసిఆర్ ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఒంగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సోమవారం కలిశారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద నైట్ షెల్టర్లు, వసతులు ఏర్పాటు చేయాలని బాలకృష్ణ.. కెసిఆర్‌ను కోరారు.

ఇందుకు కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో తమ ప్రభుత్వం సహకారం ఇంటుందని కెసిఆర్... బాలయ్యకు హామీ ఇచ్చారు.

నైట్ షెల్టర్లతో పాటు.. బసవతారకం ఆసుపత్రి రోగులకు, కుటుంబాల అవసరాల కోసం అనేక నిర్మాణాలు చేపట్టామని, వాటిని క్రమబద్దీకరించాలని బాలయ్య కోరారు. దానికి కెసిఆర్ మాట్లాడుతూ... క్రమబద్దీకరిస్తామన్నారు. మోక్షజ్ఞను సినిమాలో పరిచయం చేయబోతున్నట్లు బాలయ్య సీఎంకు చెప్పారు.

Balakrishna meets Telangana CM, KCR talks about 100th film of Balayya

డిక్టెటర్ సినిమాకు ఆహ్వానం

డిక్టెటర్ సినిమాను చూడాలని తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును నటుడు బాలకృష్ణ ఆహ్వానించారు. దానికి కెసిఆర్ సమ్మతించారు. అనంతరం బాలకృష్ణ వందో సినిమా గురించి కెసిఆర్ ఆరా తీశారు. ఆ సినిమా ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా తన వందో సినిమా ఉంటుందని బాలయ్య చెప్పారు.

ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం నా అదృష్టం: బ్రాహ్మణి

ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం తన అదృష్టమని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి నారా లోకేష్

ఎన్టీఆర్‌ను విస్మరించారు: మాగంటి గోపినాథ్

తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావును తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. ఆయన వర్థంతి సందర్భంగా కనీస ఏర్పాటు కూడా చేయలేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మండిపడ్డారు.

Balakrishna meets Telangana CM, KCR talks about 100th film of Balayya

మాగంటి ఆధ్వర్యంలో తెలంగాణ టిడిపి నేతలు నేతలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాజకీయ జీవితం ప్రసాదించిన ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించడం దారుణమని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తాం: పురందేశ్వరి

తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ 20వ వర్థంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్నవంతెన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అంటూ ఆయన నిరంతరం పేదల కోసమే పరితపించేవారని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటామని పురంధేశ్వరి చెప్పారు.

English summary
Balakrishna meets Telangana CM, KCR talks about 100th film of Balayya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X