హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో కాల్పులపై బాలకృష్ణ, ఏపీలో అసెంబ్లీపై థ్రిల్లింగ్ అంటూ..

అమెరికాలో తెలుగు వాళ్ల పైన దాడులు దురదృష్టకరమని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో తెలుగు వాళ్ల పైన దాడులు దురదృష్టకరమని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు అన్నారు. కాన్సాస్ కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే.

అమరావతిలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలపై..

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలపై స్పందిస్తూ.. ఇది చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

అలాగే, హిందూపురం విభేదాల పైన స్పందించారు. హిందూపురంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని తిరిగి తీసుకుంటామని, వారి పైన వేటు ఎత్తివేస్తామని చెప్పారు.

<strong>చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య</strong>చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య

Balakrishna responds on America firing

కాగా, హిందూపురం తెలుగు తమ్ముళ్ల పంచాయతీ హైదరాబాదుకు చేరింది. బాలకృష్ణతో మంగళవారం భేటీ అయ్యేందుకు టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణతో పాటు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు వంద మందికి పైగా సోమవారం రాత్రి బయలుదేరివెళ్లారు.

అనారోగ్యం కారణంగా మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు సోమవారం రాత్రి బయలుదేరలేదు. మంగళవారం తెల్లవారుజామున ఆయన బెంగళూరు నుంచి హైదరాబాదుకు విమానంలో వచ్చారు.

మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు పీఏ శేఖర్‌ నిరంకుశ వైఖరి, అక్రమాల చిట్టా బహిర్గతం చేశారు.

ఇదిలా ఉండగా, హిందూపురంలో పార్టీలో గొడవ పైన అధిష్ఠానం, ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి ఇరువర్గాలను శాంతింపచేశారు. నియోజకవర్గంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అధిష్ఠానం, ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్‌గా కృష్ణమూర్తిని హిందూపురానికి పంపారు.

రెండు విడతలుగా టీడీపీలోని ఇరు వర్గాలతో సమావేశాలు నిర్వహించి పీఏ శేఖర్‌పై నియోజకవర్గంలో, పార్టీలో నెలకొన్న విభేదాలు, నాయకులు, కార్యకర్తల మనోభావాలను ఆరా తీసిన ఆయన ఎమ్మెల్యేకు నివేదిక అందించారు.

ఈ మేరకు బాలకృష్ణ స్పందించి మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు, అంబికా లక్ష్మీ నారాయణకు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని చెప్పారు. ఇది కుటుంబ సమస్య అని, మంగళవారం హైదరాబాద్‌కు వస్తే అందరం కూర్చుని మాట్లాడి పరిష్కరించుకుందామన్నారు. దీంతో వారు ఈ రోజు హైదరాబాద్ వచ్చారు.

English summary
Hindupuram MLA and Actor Nandamuri Balakrishna responded on America firing on Tuesday in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X