• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటీటీపై హోస్ట్‌గా బాలయ్య ఎంట్రీతో మారనున్న ఈక్వేషన్స్: నాగార్జున, జూ.ఎన్టీఆర్: బిగ్‌ఫైట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గతిని మార్చివేసినట్టే కనిపిస్తోంది. ఏ సెంటర్లలో తప్ప మిగిలిన పెద్దగా వినిపించని ఓవర్ ద టాప్ (ఓటీటీ) పేరు ఇప్పుడు విస్తృతమైంది. సీ సెంటర్ల వరకూ తన పరిధిని విస్తరించుకున్నట్టే. కరోనా వైరస్ ప్రభావం వల్ల నెలల తరబడి థియేటర్లు మూతపడటం వల్ల నిర్మాతలు ఓటీటీ రూపంలో తమ ప్రత్యామ్నాయాన్ని వెదుక్కున్నారు.

ఓటీటీ బాట పట్టిన ఇండస్ట్రీ..

ఓటీటీ బాట పట్టిన ఇండస్ట్రీ..

కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తరువాత భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ తనను తాను మార్చుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని మరీ సినిమాలు తెరకెక్కాయంటే.. దీనికి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యధిక సంఖ్యలో చలన చిత్రాలను నిర్మించే ఇండస్ట్రీలుగా పేరున్న టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌ సైతం దీనికి మినహాయింపేమీ కాదు.

ఇల్లే సినిమా థియేటర్..

ఇల్లే సినిమా థియేటర్..

ఓటీటీలు ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇల్లే.. సినిమా థియేటర్‌గా మారింది. చాలా చోట్ల థియేటర్లు పూర్తిగా తెరచుకోలేదు. 50 శాతం కెపాసిటీతోనే నడవాల్సి వస్తోంది. సెకెండ్ షోలకు అనుమతి ఇవ్వట్లేదు. మహర్నవమి నుంచి వందశాతం సీట్లను నింపుకోవడానికి థియేటర్ల యజమానులకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

సెకెండ్ షోలకు కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ పరిస్థితి చాలా రాష్ట్రాల్లో ఇంకా రాలేదు. జనం నాడిని పసిగట్టడం వల్లే భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈ ప్లాట్‌ఫామ్స్ వైపే మొగ్గు చూపుతున్నాయి.

ఓటీటీ బాట పట్టిన నటసింహం..

ఓటీటీ బాట పట్టిన నటసింహం..

బిగ్గెస్ట్ రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ సైతం ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో తొలిసారిగా ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై టెలికాస్ట్ అవుతోంది. తాజాగా- మాస్ ఇమేజ్ ఉన్న టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం హోస్ట్‌గా ఓటీటీ బాట పట్టారు. ఇయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే- ఆహాలో ప్రసారం కానుంది. వచ్చేనెల 4వ తేదీ నుంచి ఇది ప్రసారమౌతుంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన ప్లాట్‌ఫామ్ ఇది.

ఇప్పటికే జూనియర్ జెండా..

ఇప్పటికే జూనియర్ జెండా..

నందమూరి కుటుంబం నుంచి ఓ స్టార్ హీరో హోస్ట్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తన కేరీర్‌ను ఎప్పుడో ప్రారంభించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఆరంభం అయిందే జూనియర్‌తో. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్నాడు.

అక్కడితో అతను మళ్లీ బుల్లితెరపై కనిపించకపోవచ్చని అనుకుంటోన్న దశలో మీలో ఎవరు కోటీశ్వరుడుతో ప్రత్యక్షం అయ్యాడు. జెమినిలో ప్రసారమౌతోన్న ఈ షో.. వీక్షకుల అంచనాలకు అనుగుణంగా సాగుతోంది. బుల్లితెరపై జూనియర్ జెండా పాతాడు.

ఆకట్టుకుంటోన్న అక్కినేని..

ఆకట్టుకుంటోన్న అక్కినేని..

మరోవంక- అదే బుల్లితెరపై స్టార్ ఇమేజ్ ఉన్న మరో మాస్ హీరో.. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉంటోన్నాడు. తనదైన మార్క్ వేశాడు. అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగుకు హోస్ట్‌గా హ్యాట్రిక్ కొట్టాడు. జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తరువాత.. మూడో సీజన్‌లో అడుగు పెట్టిన అక్కినేని అందగాడు.. తన ఛారిష్మాతో వీక్షకులను కట్టి పడేస్తున్నాడు. స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు. వీకెండ్ వచ్చేసరికి బిగ్‌బాస్ షో తప్ప మరొకటి చూడటానికి ఇష్టపడని వాతావరణాన్ని కల్పించాడు.

  NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
  బాలయ్య సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది..?

  బాలయ్య సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది..?

  జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున ఇప్పటికే తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. హోస్ట్ రోల్‌లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ కోణంలో బాలయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను మరింత రక్తికట్టిస్తాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

  రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామంలోనూ బాలకృష్ణ పేరు తెలియని వారుండరు. అలాంటి మాస్ హీరో.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అడుగు పెట్టనుండటం.. దీని మార్కెట్‌ను మరింత ఎక్స్‌పాండ్ చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

  English summary
  Balakrishna Talk Show On AHA: To Clash With Jr NTR And Nagarjuna.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X