వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు, కేసీఆర్‌లతో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి చూస్తాను: బాలకృష్ణ
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోను, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోను కలిసి తాను గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూస్తానని బాలకృష్ణ శుక్రవారం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోను, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోను కలిసి తాను గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూస్తానని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ శుక్రవారం తెలిపారు.
ఈ నెల 12వ తేదీన ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌లో ప్రదర్శించే బెనిఫిట్ షోకు కేసీఆర్‌ను ఆహ్వానించానని, ఆ రోజున తెలంగాణ సీఎంతో కలిసి సినిమా చూస్తానని చెప్పారు.
అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన
మరుసటి రోజు అంటే, 13వ తేదీన విజయవాడలో తాను మళ్లీ సినిమా చూస్తానన్నారు. అప్పుడు చంద్రబాబుతో కలిసి సినిమా చూసే అవకాశముందని ఆయన అన్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం బాలయ్య.. కేసీఆర్‌ను కలిసి సినిమాకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Comments
gautamiputra satakarni balakrishna nandamuri balakrishna kcr chandrababu naidu assembly నందమూరి బాలకృష్ణ కేసీఆర్ అసెంబ్లీ గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రబాబు నాయుడు
English summary
Balakrishna will see Gautamiputra Satakarni along with KCR in Hyderabad.