హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈసారి స్కైలాబ్ రెడ్డికి దక్కింది: ఆల్ టైం రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహా గణనాథుల నిమజ్జనాలతో నగరం కోలాహలంగా మారింది. గురువారం ఉదయం నుంచే గణపతి నిమజ్జనాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణపతి శోభయాత్ర గురువారం ఉదయమే ప్రారంభమైంది.

Balapur Ganesh Laddu auction

శోభయాత్రకుముందే లడ్డూ వేలం నిర్వహించారు. ఈసారి లడ్డూ వేలంలో 10మంది స్థానికేతరులు పాల్గొన్నారు. కాగా, గత సంవత్సరం 10.32లక్షలు పలికింది బాలాపూర్ గణపతి లడ్డూ. నిరుడు లడ్డూను దక్కించుకున్న మదన్ మోహన్ రెడ్డికి బంగారు గొలుసుతో ఈ సందర్భంగా సన్మానించారు.

వేలంలో పోటాపోటీ

ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో బాలాపూర్‌ వినాయకుడి లడ్డూకు అంతే ప్రాముఖ్యత ఉంది. బలాపూర్ లడ్డూను సొంతం చేసుకోవాడినికి భారీగానే వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పోటీపడుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న బాలాపూర్ లడ్డూ వేలంలో కూడా పోటీ తీవ్రంగా ఉంది.

Balapur Ganesh Laddu auction

భారీ మొత్తానికి దక్కించుకున్న స్కైలాబ్ రెడ్డి

బాలపూర్ లడ్డూ ఈ యేడాది కూడా భారీ ధర కలికింది. నిరుడు రికార్డును బ్రేక్ చేస్తూ 14.65లక్షలకు స్కైలాబ్ రెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా స్కైలాబ్ రెడ్డిని ఘనంగా సన్మానించి లడ్డూను అందజేశారు.

రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. గణేశుడి ఆశీస్సులతో ఈసారి నా కల నెరవేరిందని స్కైలాబ్ రెడ్డి తెలిపారు. లడ్డూను దక్కించుకోవడం తన అద్రుష్టమని, ప్రజలకు పంపిణీ చేస్తానని స్కైలాబ్ రెడ్డి తెలిపారు. లడ్డూను దక్కించుకోవడం తన అద్రుష్టమని, ప్రజలకు పంపిణీ చేస్తానని స్కైలాబ్ రెడ్డి తెలిపారు.

కాగా, పోటీ మాత్రం తీవ్రంగా జరిగింది. ఎమ్మెల్యే తీగ క్రిష్ణా రెడ్డి 9లక్షల వరకు పాటపాడి ఆగిపోగా.. మన్నె బలవంతరెడ్డి 14.62లక్షలు, కొలను రాంరెడ్డి 13.80లక్షలు, శైలేందర్ రెడ్డి 12.85లక్షలు వేలంపాటు పాటపాడి ఆగిపోయారు. 1994 నుంచి లడ్డూ దక్కించుకున్న వారు

1994లో కొలను మోహన్ రెడ్డి - రూ. 450
1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500
1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000
1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000
1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000
1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000
2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000
2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000
2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000
2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000
2004లో కోలను మొహన్ రెడ్డి -రూ.2,01,000
2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000
2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000
2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000
2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000
2009లో సరిత -రూ.5,10,000
2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000
2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000
2013లో తీగల క్రిష్ణా రెడ్డి -రూ. 9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000
2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000
2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000

English summary
Balapur Ganesh Laddu auction started from Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X