హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డు: రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలాపూర్ గణేషుడి లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ 10.32 లక్షలు పలికింది. ఆదివారం నాడు ఉదయం బాలాపూర్ లడ్డూను వేలం వేశారు. ఈ వేలం పోటాపోటీగా జరిగింది.

మొదటి నుంచి పోటాపోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ గణేషుడి లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ రూ.9.50 లక్షలు పలికింది. గత ఏడాది కంటే ఎక్కువ పలికింది. బాలాపూర్ లడ్డూలో ఇది కొత్త రికార్డు.

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేలం పాట కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

1994లో తొలిసారి బాలాపూర్ గణేష్ లడ్డూ.. రూ.450 పలికింది. అది ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత ఆ ధర పది లక్షల మార్కును దాటింది.

 రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

వైభవంగా, కన్నుల పండువగా ఏటా జరిగే గణనాథుడి నిమజ్జనం ఆదివారం ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ కొనసాగనున్న ఖైరతాబాద్ వినాయకుడి సామూహిక నిమజ్జనానికి పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పోలీసు బలగాలను రప్పించారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధుల్లోని 8 చెరువుల్లో 40వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు పోలీసుల అంచనా. ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్ యంత్రాంగం రెండురోజుల ముందే ఏర్పాట్లన్నీ పూర్తిచేశాయి.

 రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

వినాయక సాగర్ (హుస్సేన్ సాగర్‌) వద్ద నిమజ్జనం తీరును పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. సందర్శకుల కోసం తాగునీటి సౌకర్యాన్ని, వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు.

 రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లో ఆదివారం ఒక్కరోజే 40 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని అంచనా వేశారు. జంటపోలీస్‌ కమిషనరేట్ల సిబ్బంది, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మొత్తం 31వేల మంది పోలీసులు నిమజ్జన విధుల్లో పాల్గొంటున్నారు.

 రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఇదే

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కమాండ్‌ కంట్రోల్‌ రూంలు ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, క్రేన్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా నిరంతరం సమీక్షిస్తూ ట్రాఫిక్‌ పోలీస్‌తోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకు అనుసంధానంగా పనిచేస్తాయి.

English summary
It fetched a whopping Rs 10.32 lakh in the open auction held before the start of the centralised Ganesh idol immersion procession here on Sunday morning. Over 20 bidders took part in auctioning this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X